Kalki2898AD : కల్కి కొత్త రిలీజ్ డేట్.. అటు ఇటు కాకుండా మధ్యలో దూరిందే?

Kalki2898AD : టాలీవుడ్ లో రాబోయే క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో అన్నిటికంటే ముందు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ కల్కి2898AD అనే చెప్పాలి. అసలు సలార్ తర్వాత నటిస్తున్న ప్రభాస్ కల్కి 2898AD మూవీ పై తెలుగు ప్రేక్షకులకు మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ కొత్త లోకాన్ని చూడాలని ప్రేక్షకులు అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన అశ్వత్థామ కారెక్టర్ ఇంట్రోని వదిలారు. ఇందులో అమితాబ్‌ను చూపించిన పద్దతి, డీ ఏజింగ్ టెక్నాలజీని వాడి యంగ్ అమితాబ్‌ను చూపించిన తీరుకు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా షాక్ అవుతున్నారు. ఈ మూవీ టెక్నికల్‌గా ఇండియన్ మూవీ ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉందని అంతా ఫిక్స్ అయ్యారు.

మళ్ళీ కొత్త రిలీజ్ డేట్.?

అయితే ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న ప్రభాస్ కల్కి మూవీ కి మాత్రం విడుదల తేదీ పెద్ద సమస్యగా మారింది. దాదాపు ఆరు నెలలుగా ఈ సినిమా రిలీజ్ డేట్లు మారుతూ వస్తున్నాయి. గత ఏడాది ముందు 2024 సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. కానీ సలార్ వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత ఎప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని అన్నారు. ఫైనల్ గా వైజయంతీ మూవీస్‌ కు కలిసి వచ్చిన మే 9వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. చాలా రోజుల పాటు ఈ డేట్ కి కంఫర్మ్ అని ఆడియన్స్ సైతం ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా ఎన్నికల హడావిడి ఉండటంతో అంతా తారుమారైంది. రిలీజ్ డేట్ వాయిదా వేయగా, ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించలేదు. అయితే తాజాగా మరో కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. కల్కి2898AD మూవీని జూన్ 27న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ రిలీజ్ డేట్ కూడా కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తుంది.

అటు ఇటు కాకుండా మధ్యలో రిలీజ్ అంటే కష్టమే?

అయితే కల్కి2898AD మూవీ ని జూన్ 27న రిలీజ్ చేస్తే ఇబ్బంది కల్కి కే జరుగుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ మూవీ ఇండియన్ 2, పుష్ప 2 ల రిలీజ్ ల మధ్యలోకి వచ్చి దూరింది. అటు రెండు వారాలు, ఇటు రెండు వారాల గ్యాప్ ఉన్నాయంతే. ఇండియన్2 జూన్ 13న రానుండగా, ఆగస్ట్ 15న పుష్ప 2 రాబోతోంది. మధ్యలో జూన్ 27ని కల్కి బ్లాక్ చేసినట్టుగా సమాచారం. ఇదే నిజమైతే మాత్రం మూడు సినిమాల కలెక్షన్ల మీద ప్రభావం చూపెడుతుంది. కల్కి (Kalki2898AD) కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే, రెండు వారాలు చాలవు. అప్పుడు పుష్ప 2 కి థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టం అవుతుంది. ఇలాంటి పెద్ద సినిమాలకు కనీసం ఒక నెల అయినా గ్యాప్ ఉంటే బాగుంటుందనేది నెటిజన్ల అభిప్రాయం. పైగా ప్రభాస్ సినిమా కాబట్టి తెలుగులో ఎలాగో థియేటర్లు సర్దుబాటు అయినా, ఇతర భాషల్లో ఏ సినిమాకి డిమాండ్ ఉంటే ఆ సినిమానే వేస్తారు. అన్నిటికి మించి మూడు సినిమాలకు కూడా రిలీజ్ కి నెల గ్యాప్ ఉండేలా చూస్తే మంచిదని ట్రేడ్ పండితుల అభిప్రాయం. మరి కల్కి మేకర్స్ రిలీజ్ డేట్ పై ఎలా స్పందింస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు