Vote: ఓటు హక్కు లేని హీరో, హీరోయిన్స్ వీళ్ళే..!

Vote.. ఓటు ప్రతి ఒక్కరి గుర్తింపు..సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా.. తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యత.. కొంతమందికి ఓటు వేయడం సాధ్యం కాకపోవచ్చు.. ముఖ్యంగా ఓటు వేసి రాష్ట్రానికైనా దేశానికైనా ఉన్నతమైన వ్యక్తులను ఎన్నుకొని అభివృద్ధికి తమ వంతు కృషి చేయాల్సి ఉంటుంది.. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది ఓటు హక్కును వినియోగించడం సాధ్యపడదు.. అలా ఇప్పటివరకు తమ ఓటు హక్కును వినియోగించుకోని హీరోలు , హీరోయిన్లు కూడా ఉన్నారు. ఈ విషయం కాస్త ఆశ్చర్యపరిచినా.. ఓటు హక్కు వినియోగించుకోని సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. అయితే వారు ఎవరు ?ఇప్పటివరకు తమ ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోలేదు ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

Vote: These are the heroes and heroines who do not have the right to vote..!
Vote: These are the heroes and heroines who do not have the right to vote..!

అక్షయ్ కుమార్:

ఓటు అనగానే ఓటు వేయాల్సిన బాధ్యత మనదే అని చెప్పే ప్రముఖ హీరోల్లో అక్షయ్ కుమార్ ముందుంటారు.. అక్షయ్ కుమార్ కి దేశభక్తి చాలా ఎక్కువ. సామాజిక స్పృహ తీసుకురావడానికి తన వంతు పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తారు. అంతే కాదు మంచి మెసేజ్ ఉన్న సినిమాలు తీసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. అయితే ఇలా అన్నీ చెప్పి చేసే అక్షయ్ కుమార్ కి మన దేశంలో ఓటు హక్కు లేదు ..ఎందుకంటే కెనడా పాస్ పోర్ట్ కలిగి ఉన్నారు.. అతనికి కెనడా పౌరసత్వం ఉంది. అందుకే అక్షయ్ కుమార్ సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేయలేకపోతున్నారు.

కత్రినా కైఫ్..

కోట్ల మంది అభిమానులను దక్కించుకున్న కత్రినా కైఫ్ కూడా భారత సంతతికి చెందిన వారు కాదు.. అందుకే ఈమెకి ఇక్కడ ఓటు హక్కు లేదు.. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న కత్రినా కైఫ్ హాంకాంగ్ లో జన్మించారు.. అంతేకాదు ఈమె బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్న నేపథ్యంలో ఇండియాలో ఈమెకి పౌరసత్వం లేదు.. కాబట్టి ఓటు వేసే హక్కు కూడా లేదు.

- Advertisement -

అలియా భట్..

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో అటు టాలీవుడ్ హీరోయిన్ గా ఇటు పాన్ ఇండియా హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆలియా భట్ ఇప్పటివరకు తన ఇండియాలో ఓటు వేయలేదు.. దానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.. నిజానికి ఈమె భారత పౌరురాలు కాదు బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉంది.. ఎందుకంటే ఈమె తల్లి బర్మింగ్ హామ్ కి చెందిన మహిళ కావడంతో ఈమె కూడా అక్కడే పుట్టడం వల్ల ఆలియా భట్ కి భారత్ లో ఓటు హక్కు లేదు.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్..

బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఇండియాలో ఓటు వేయడానికి అర్హత లేదు. ఈమె భారతీయురాలు కాదు.. బహ్రెయిన్ కు చెందిన లేడి.. ఈమె అక్కడే పుట్టింది అంతేకాదు ఈమె తల్లిదండ్రులు కూడా ఇండియన్స్ కాదు.. ఈమె తండ్రిది శ్రీలంక అయితే.. ఈమె తల్లిది మలేషియా..ఈమె ఆస్ట్రేలియాలో కాలేజీ పూర్తి చేసి, శ్రీలంకలో సెటిల్ అయింది.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాలు చేస్తోంది.

నోరా ఫతేహి:

బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న నోరా ఫతేహి కూడా ఇండియన్ కాదు.. కెనడా పౌరురాలు. అక్కడే పుట్టింది..ఇండియాలో సెటిల్ అయింది.. ఇప్పటికీ తన మూలాలు కెనడాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈమెకు ఇండియాలో ఓటు వేసే హక్కు లేదు.

ఇలియానా డి క్రూజ్..

తన అంద చందాలతో నడుము ఒంపు సొంపులతో యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఇలియానా కూడా భారతదేశంలో ఓటు హక్కును పొందలేదు. ఈమె పోర్చుగీస్ నటి ..ఈమె ముంబైలోనే పుట్టినప్పటికీ పోర్చుగీస్ లో పౌరసత్వం పొంది ఉంది. అందుకే ఈమెకు భారత్ లో ఓటు వేసే హక్కు లేదు..

వీరితోపాటు నర్గీస్ ఫక్రీ, సన్నీ లియోన్, అమీ జాక్సన్ కల్కి కొచ్లిన్ , దీప్తి నావల్ తదితరులకు ఇండియాలో ఓటు హక్కు లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు