Suhas: ఆ స్టార్ హీరోతో పోల్చిన సుకుమార్.. బిరుదు తో పాటు అవకాశం కూడా..!

Suhas.. ప్రముఖ యంగ్ హీరో సుహాస్ ఒక్క సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. కలర్ ఫోటో సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. హిట్ -2 సినిమాలో విలన్ గా నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం ప్రసన్న వదనం.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. సుహాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. సుహాస్ ను ఆ స్టార్ హీరో తో పోల్చడమే కాదు.. బిరుదు కూడా ఇచ్చి పైగా పుష్ప సినిమాలో అవకాశాన్ని ఇద్దామనుకొని ఆ తర్వాత ఎందుకు ఇవ్వలేకపోయారో కూడా వెల్లడించారు..

Suhas:Sukumar compared to that star hero.. along with the title also the opportunity..!
Suhas:Sukumar compared to that star hero.. along with the title also the opportunity..!

నానితో సుహాస్ ని పోల్చిన సుకుమార్..

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ.. సుహాస్ ను నాని తో పోల్చారు.. నాని లాగే సుహాస్ పైకి వచ్చారు.. సుహాస్ లాంటి నటులు ఇండస్ట్రీకి చాలా అవసరం. అంటూ తెలిపారు.

మట్టి స్టార్ అంటూ సుహాస్ కి బిరుదు..

నాని సహజ నటుడు అయితే సుహాస్ మట్టి స్టార్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక మొత్తానికి మట్టి స్టార్ అంటూ సుహాస్ కు బిరుదు అందించారు సుకుమార్..

- Advertisement -

కేశవ పాత్రను అందుకే ఇవ్వలేదు..

సుకుమార్ మాట్లాడుతూ.. సుహాస్.. నువ్వంటే నాకు, అల్లు అర్జున్ కు చాలా ఇష్టం.. ప్రత్యేకించి అల్లు అర్జున్ కి మరీ ఇష్టం.. సినిమా షూటింగ్లో ఉన్నంతసేపు చాలా సందర్భాలలో నీ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు బన్నీ.. అంతేకాదు పుష్ప సినిమాలో బన్నీ పక్కన కేశవ క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.. ఆ క్యారెక్టర్ ముందుగా నీకే ఇద్దామని అటు అల్లు అర్జున్ ఇటు నేను ఇద్దరం అనుకున్నాము. కానీ అప్పటికే నువ్వు హీరోగా సినిమాలు చేస్తున్నావు.. ఒక హీరోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశం ఇవ్వడం అంత మంచిగా అనిపించలేదు.. అందుకే ఆ అవకాశాన్ని నీకు ఇవ్వలేదు అంటూ తెలిపారు సుకుమార్. మొత్తానికి అయితే హీరో కావడం వల్ల పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాన్ని కోల్పోయారు సుహాస్. ఇలాగే కొత్త కొత్త సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలని సుకుమార్ ఆకాంక్షిస్తూ కామెంట్లు చేశారు. మొత్తానికైతే కలర్ ఫోటో సినిమాతో వెలుగులోకి వచ్చిన సుహాస్ కి ఏకంగా మట్టి స్టార్ అంటూ బిరుదు ఇవ్వడం గమనార్హం.

సుకుమార్ సినిమాలు..

ఎంతోమంది హీరోలకు స్టార్ స్టేటస్ ను అందించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సుకుమార్.. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప మేనియా కొనసాగిస్తున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న ఈయన ఇప్పుడు పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్ , పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు