Rajamouli: జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే.. అవమానాలు, నిందలు కూడా..!

Rajamouli.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని డైరెక్టర్లలో ముందువరుసలో రాజమౌళి ఉన్నారని చెప్పవచ్చు.. తను తీసిన సినిమాలు ఇప్పటివరకు సరికొత్త కథాంశం తోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. రాజమౌళి సినిమాని ఎంత గొప్పగా తెరకెక్కిస్తారో అంతే ఎగ్జైటింగ్ గా ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటారు. అందుకే రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా రికార్డులను సృష్టిస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా సరే ఎవరు వదులుకోకుండా నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోల ఎంపిక విషయంలో కూడా చాలా నిబద్ధతతో రాజమౌళి ఉంటారు.

Rajamouli: That's the biggest mistake in life.. Insults and accusations too..!
Rajamouli: That’s the biggest mistake in life.. Insults and accusations too..!

చేసింది తక్కువ సినిమాలే అయినా..

ముఖ్యంగా తను తీసుకున్న కథకు సరిపడే హీరోలతో పాటు తనకు సహకరించే వాళ్లతోనే సినిమాలను చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు.. అందుకే తన కెరీర్ లో ఇప్పటివరకు 12 సినిమాలు మాత్రమే చేసినా.. ఎక్కువగా ఎన్టీఆర్-4, ప్రభాస్-3, రామ్ చరణ్-2 సినిమాలు చేశారు.. అలాగే సునీల్, రవితేజ, నాని వంటి హీరోలతో కూడా ఒక్కొక్క సినిమాలను చేశారు రాజమౌళి.. అయితే రాజమౌళి డైరెక్షన్లో పనిచేసిన హీరోలందరూ కూడా స్టార్డమ్ ని అందుకున్నారు. తాజాగా రాజమౌళి ఒక బ్లెండర్ మిస్టేక్ చేశారనే వాదన వినిపిస్తోంది.

RRR తోనే తలనొప్పి..

అదేమిటంటే RRR చిత్రంతో అటు నందమూరి ఇటు మెగా హీరోలను ఎంపిక చేసుకోవడమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..RRR సినిమా రాజమౌళి పైన కాస్త ఎఫెక్ట్ కూడా చూపించింది.. ముఖ్యంగా ఈ సినిమా విడుదలయ్యే సమయం ముందు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఎవరి పాత్ర గొప్పగా ఉంటుందని అభిమానులు చాలా అంచనాల వేసుకున్నారు.. ఇందులో ఎన్టీఆర్ భీమ్ పాత్రలో చాలా ఇన్నోసెంట్ గా కనిపించగా.. రామ్ చరణ్ పాత్రనే కాస్త హైలెట్ గా కనిపించింది అని.. చివరిలో ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా సీన్స్ పండాయని ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

- Advertisement -

ఆ తప్పు ఇక చేయరేమో..

అప్పటినుంచి రాజమౌళి పైన ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఫైర్ అవుతూ ఉన్నారు.. ఎన్టీఆర్ ని తక్కువ చేసి చూపించారా? అని చాలా సందర్భాలలో కూడా రాజమౌళిని డైరెక్ట్ గానే అడిగారు. మరి కొంతమంది కామెంట్స్ రూపంలో కూడా ఏకిపారేశారు.. సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉంది.. ఇప్పటికి రెండేళ్ల అవుతూ ఉన్న ఈ విషయం మాత్రం కనుమరుగవ్వలేదు. ఇటీవలే బాహుబలి చిత్రానికి సంబంధించి ప్రెస్ మీట్ లో కూడా..RRR చిత్రంలో ఒక హీరోని తక్కువ చూపించారనే వాదన వినిపిస్తోంది అంటూ ఒక విలేకర్ అడగగా.. ఇందుకు సమాధానం చెప్పడానికి కూడా రాజమౌళి చాలా గిల్టీగా ఫీల్ అయినట్లుగా తెలియజేశారు.. కేవలం ఈ ప్రశ్న ను దాటేయడానికి ఇది సరైన సమయం కాదంటూ తెలియజేశారు. ఇక ఈ పాత్రల వల్ల తాను ఎన్నో విమర్శలు, అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. మొత్తానికైతే మెగా నందమూరి హీరోలను ఒకే సినిమాలో ఎంచుకోవడమే రాజమౌళికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు మొత్తానికైతే ఈ సినిమా ఈయనకు భారీ ఎదురుదెబ్బను కలిగించిందని సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు