Indian2 : ఆ పాట కోసమే సినిమా వాయిదా..! అంత విషయముందా?

Indian2 : కోలీవుడ్ స్టార్ లోక నాయకుడు కమల్ హాసన్ శంకర్ షణ్ముగం దర్శకత్వం లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇండియన్2 తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. తెలుగులో భారతీయుడు 2 పేరుతో విడుదల కానున్న ఈ సినిమా నాలుగేళ్ళ కిందటే మొదలైనా, షూటింగ్ పలు కారణాల వల్ల ఆగిపొయి మళ్ళీ పట్టాలెక్కింది. తీరా ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకునేసరికి మళ్ళీ ఏవో ఒక అవంతరాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక భారతీయుడు 2 సినిమా ట్రైలర్ గాని, పాటలు గాని ఇప్పటివరకు మళ్ళీ రిలీజ్ అవలేదు. ఇక రిలీజ్ డేట్ జూన్ 13న అనుకున్నా మళ్ళీ జులై కి షిఫ్ట్ చేసారని తెలుస్తుంది. సినిమా రిలీజ్ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడగా, ఇంకా వాయిదా వేసుకుంటూ పోతే సినిమాపై ఉన్న అంచనాలు తగ్గిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఇది ఎప్పుడో పాతికేళ్ల కింద వచ్చిన సినిమాకి సీక్వెల్. ఆ సినిమాని ఇప్పటి ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకునే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు సినిమాపై బజ్ ఉన్నప్పుడే దాన్ని మరింత పెంచి రిలీజ్ చేయాల్సింది పోయి ఉన్న హైప్ కూడా పోయాక రిలీజ్ చేసేట్టు ఉంది చిత్ర యూనిట్ వ్యవహారం.

పాట కోసమే వాయిదా?

ఇదిలా ఉండగా ఇక ఈ సినిమా విషయంలో మరోసారి సస్పెన్స్ మొదలైంది. అనుకున్న సమయానికి రిలీజ్ లేకపోవడం వాయిదా పడడంతో అంచనాలు మరింత సన్నగిల్లుతున్నాయి. అయితే ఇప్పుడు సినిమా ఆలస్యానికి ఓ సాంగ్ షూట్ కారణం అని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. నిజానికి షూటింగ్ అంతా ఎప్పుడో అయిపోయిందని కమల్ ప్రకటించారు. కానీ ఇప్పుడు శంకర్ కమల్ పై మరో సాంగ్ తెరకెక్కించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో భారతీయుడు 2 (Indian2) ఆలస్యానికి ఇదొక కారణం కూడా కావచ్చని టాక్. మరి అసలు ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

పాటలో అంత విషయముందా?

ఇక వాయిదా పడ్డ ఇండియన్ 2 కి కారణం ఓ పాట అని తెలియగానే నెటిజన్లు పాట గురించి చర్చిస్తున్నారు. అయితే శంకర్ సినిమాలో పాటలు ఎంత గ్రాండియర్ గా ఉంటాయో తెలిసిందే. ఆ పాటల్లో సినిమా నేపథ్యం కూడా చెప్పేస్తుంటారు. మరి ఇప్పుడు షూట్ చేయబోయే ఆ పాటలో అంత విషయముందా? అందుకే వాయిదా వేసారా అని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా సినిమా రిజల్ట్ బాగుంటే అదే చాలు అని కమల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఇండియన్ 2 కి వారం రోజుల ముందు పాత ఇండియన్ సినిమాని రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సిద్ధార్థ్, లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఇండియన్2 సినిమా రిలీజ్ అయితే కానీ, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు