Indian2 : ఉలగనాయగన్ కోసం ఒకే వేదికపై సూపర్ స్టార్, గ్లోబల్ స్టార్..!

Indian2 : శంకర్ షణ్ముగం లోక నాయకుడు కమల్ హాసన్ లో ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 ఎట్టకేలకు జూన్ 13న రిలీజ్ కి రెడీ అవుతుందన్న సంగతి తెలిసిందే. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టనుంది. ఇక ఈ సినిమా నాలుగేళ్లకు పైగా నిర్మాణం జరుపుకోగా, లైకా ప్రొడక్షన్ సంస్థ భారీ వ్యయంతో నిర్మిస్తుంది. ఇక దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఇండియన్ 2 ఆ మధ్యలో పలు కారణాల వల్ల మధ్యలోనే షూటింగ్ కొన్నాళ్ళు ఆగిపోయిందని తెలిసిందే. ఇక లాస్ట్ ఇయర్ మళ్ళీ మొదలు కాగా, దీని వల్ల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. ఏది ఏమైనా ఇండియన్ 2 షూటింగ్ ముగంపు దశకు చేరుకోగా ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టనుంది. ఇక తాజాగా ఓ అదిరిపోయే క్రేజీ అప్డేట్ ఇండియన్ 2 టీమ్ నుండి వచ్చింది.

కమల్ కోసం రజినీ, చరణ్..

ఇక అసలు విషయానికి వస్తే, కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2 కి అన్ని రూట్లు క్లియర్ అవుతున్నాయి. జూన్ 13న సినిమా విడుదలని లాక్ చేసుకుని ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సంగతి తెలిసిందే. దీనికి మరికాస్త బలం చేకూరేలా ఒక కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే నెల మే 16న ఈ (Indian2) సినిమా ఆడియో లాంచ్ చెన్నైలోని నెహ్రు స్టేడియంలో నిర్వహించేందుకు ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. అప్పటికంతా ఎన్నికల వేడి పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి, ఇండియన్ 2 కి బజ్ పెంచడానికి దీన్ని మొదటి మెట్టుగా వాడుకోబోతున్నారట. అయితే అసలు విశేషం ఇది కాదు. ఇండియన్ 2 సినిమాకి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజనీకాంత్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రావడం దాదాపు ఫిక్స్ అయినట్టే అని చెన్నై మీడియా నుండి వార్తలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ ఎలాగూ దర్శకుడు శంకర్ తీస్తోందే కావడంతో చరణ్ నో చెప్పడమంటూ ఉండదు. పైగా కమల్ వేడుక. ఇక రజినీకాంత్ కూడా తన ప్రాణ స్నేహితుడి సినిమా ఒక పక్క, ఇంకో వైపు తనకు మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ ఇంకోవైపు. ఎందుకు నో చెబుతారు. సో ఈ ఇద్దరూ ఇండియన్ 2 వేడుక కు రావడం ఫిక్స్ అని ప్రచారం జరుగుతుంది.

సాంగ్స్ కోసం వెయిటింగ్..

ఇక ఇండియన్ 2 (Indian2) ఆడియో లాంచ్ వేడుకకి సంబంధించి ఇదే ఒకవేళ నిజమైతే మాత్రం ఇద్దరు సీనియర్ లెజెండరీ దిగ్గజాల మధ్య రామ్ చరణ్ కనిపించడం కన్నుల పండుగలా ఉంటుంది. సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది. ఇక ఈ అప్డేట్ పై అధికారిక ప్రకటన త్వరలో రావొచ్చు. ఇక కల్కి 2898AD రిలీజ్ డేట్ వచ్చేసింది, కానీ దానికి రెండు వారాల కన్నా ముందు వచ్చేలా భారతీయుడు 2 రెడీ అవుతోంది. మే చివరి వారంలో ఫస్ట్ పార్ట్ రీ రిలీజ్ ఉంటుంది. ఇక ఇండియన్ 2 లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, బాబీ సింహ, బ్రహ్మానందం, ఎస్. జె. సూర్య తదితరులు కీలక తారాగణంగా వ్యవహరించిన ఇండియన్ 2 మూవీ కి అనిరుద్ రవిచందర్ ఎలాంటి సంగీతం అందించాడోనని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఇక జూన్ లో ఇది వచ్చేస్తుంది కనక, గేమ్ ఛేంజర్ చివరి దశ పనులు, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ తదితర పనులన్నీ చూసుకునే అవకాశం శంకర్ కు దక్కుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు