Vishwak Sen: విశ్వక్సేన్ ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ” లో పొలిటికల్ ఎలిమెంట్స్..!

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో విశ్వక్సేన్ కూడా ఒకరు. తాజాగా విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కృష్ణ చైతన్య డైరెక్షన్లో రూపొందుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రం గత ఏడాదిలోనే థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల చేత వాయిదా పడింది.

ఇక రీసెంట్గా ఈ మూవీను మే 31 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రచారం చిత్రాలకి మంచి ఆదరణ దక్కింది. అయితే ఈ మూవీలో పొలిటికల్ ఎలిమెంట్ గట్టిగానే ఉందంటూ ప్రచారం జరుగుతుంది. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు మూవీ పై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Political elements in Vishwaksen's "Gangs of Godavari".
Political elements in Vishwaksen’s “Gangs of Godavari”.

విశ్వక్సేన్ కెరీర్ లో ఈ చిత్రం కమర్షియల్ హిట్ అవకాశాలు కనిపిస్తున్నాయి. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. అంజలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ పై విశ్వక్సేన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు