VeeraDheeraSooran : జెట్ స్పీడ్ లో చియాన్ విక్రమ్ సినిమా షూటింగ్..!

VeeraDheeraSooran : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రయోగాలకి పెట్టింది పేరైన విక్రమ్ ఆ మధ్య మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్” సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో తన సినిమాలతో మూవీ లవర్స్ ని అలరిస్తూనే ఉన్నాడు. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికైనా రెడీ అయ్యే హీరోల్లో విక్రమ్ ఒకరు. ఇక విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో “తంగలాన్” ఒకటి. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న “తంగలాన్” సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు హెచ్‌.ఆర్‌. పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం “వీర ధీర శూరన్”. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక విక్ర‌మ్ 62వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. తంగలాన్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ పనుల్లో బిజీగా ఉండి షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇవ్వగా. ఈ గ్యాప్ లో విక్రమ్ వీర ధీర శూరన్ షూటింగ్ లో ఉన్నాడు.

వరుస షెడ్యూల్స్ తో బిజీ..

ఇక విక్రమ్ నటిస్తున్న ‘వీర ధీర శూరన్’ (VeeraDheeraSooran) నుండి రీసెంట్‌గా విడుద‌లైన టైటిల్ టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. తెన్ కాశీలో భారీ సెట్ వేసి సినిమాను పూర్తి చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ రోల్‌లో విక్ర‌మ్ అల‌రించ‌బోతున్నారు. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో ఆయ‌న లుక్ మాస్‌ గా, ర‌గ్డ్‌గా ఉంది. అసలు సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచే మూవీ పై అంచ‌నాలు పెరుగిపోయాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా, అని అభిమానులు, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో విక్ర‌మ్ కాళి పాత్ర‌లో అంద‌రినీ మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారు. తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేయగా, అందులో బైక్ పైన కూరగాయలతో వెళ్తున్న విక్రమ్ ని చూపించారు. అందులో షూటింగ్ వేగంగా జరుగుతుందని అఫిషియల్ గా చెప్పారు.

Chiyan Vikram's 'Veeradheerasooran' is shooting at a fast pace

- Advertisement -

ఆగష్టు లో రిలీజ్ కి ప్లాన్..?

ఇక చియాన్ విక్ర‌మ్‌ నటిస్తున్న ఈ విలేజ్ యాక్షన్ డ్రామాలో ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్, సిద్ధికీ త‌దిత‌రులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్నీ బ్యాన‌ర్ హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్‌ లో రియా శిబు నిర్మిస్తుండగా, ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌ రోని జ‌కారియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ గా అన్‌లిన్ లాల్‌ వ్యవహరిస్తున్నారు. ఇక వీర ధీర శూరన్ సినిమాకు మ్యూజిక్‌ జి.వి.ప్ర‌కాష్ కుమార్‌ అందిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ తేని ఈశ్వ‌ర్‌ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆగష్టు లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే దీని కంటే ముందు తంగలాన్ రిలీజ్ కావాల్సి ఉంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాకే ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకుల మాట. ఇక విక్రమ్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమా రిలీజ్ విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఏది ఏమైనా విక్రమ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు