30 Years for Yamaleela : మూడు దశాబ్దాల క్లాసిక్ యమలీల.. మహేష్ బాబు చేయాల్సిన సినిమా!

30 Years for Yamaleela : టాలీవుడ్ లో అప్పుడప్పుడూ చిన్న సినిమాలే రాజ్యమేలుతుంటాయి. ఏ అంచనాలు లేకుండా అఖండ విజయాలు సాధిస్తూ, ఇండస్ట్రీ కి గొప్ప పేరు కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచి, చిన్న పిల్లల నుండి పెద్దల దాకా అందరూ మెచ్చిన అద్భుతమైన కథా చిత్రం “యమలీల”. ప్రముఖ హాస్య నటుడు అలీ హీరోగా, నవరస నటనా సర్వభౌమ కైకాల సత్యనారాయణ ప్రత్యేకపాత్రలో యముడిగా నటించిన ఫాంటసీ, కామెడీ ప్రధాన చిత్రంగా ఈ యమలీల చిత్రం తెరకెక్కింది. కామెడీతో పాటు అంతకు మించిన మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది. అలీని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఎస్.వి.కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మనిషా బ్యానర్ పై కె.అచ్చిరెడ్డి నిర్మించిన ‘యమలీల’ చిత్రం ఏప్రిల్ 28 తో 3 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా యమలీల చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం.

మహేష్ బాబు చేయాల్సిన సినిమాలో అలీ హీరోగా!

టాలీవుడ్ లో అప్పటికి చిన్న చిన్న వేషాలు, హాస్య పాత్రలు పోషిస్తున్న అలీని హీరోని చేసి, ఆయన కెరీర్‌ను సరికొత్త మలుపు తిప్పిన చిత్రం ‘యమలీల’. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా అనుకున్నది అలీని కాదు. సినిమా చేయాల్సింది అక్షరాలా మహేశ్‌ బాబు. అప్పటికీ ఆయన హీరోగా పరిచయం కాలేదు. అందుకే మహేశ్‌ను హీరోగా పరిచయం చేయాలనీ కృష్ణారెడ్డి, హీరో కృష్ణకు కథ చెప్పారు. ఆయనకు కూడా కథ నచ్చింది కూడా. అయితే కొన్నేళ్లాగి మహేష్ తో సినిమా తీద్దాం, లేదా ఇంకెవరితోనైనా చేయి అన్నారు. అప్పటికి మహేష్ చదువు పూర్తి కాకపోగా, చదువు కోసం యమలీల క్యాన్సిల్ చేసారు కృష్ణ. అప్పుడు హీరో ఎవరా.. ఎవరా అని ఆలోచిస్తుంటే హాస్య నటుడు అలీని హీరోగా తీద్దామని ఎస్వీ కృష్ణారెడ్డి కి అనిపించింది. అనుకున్నదే తడవుగా అలీని హీరోగా బుక్‌ చేశారు. అయితే కథ నేపథ్యంలో కొంచెం కామెడీని జోడించారు. మహేశ్‌బాబుతో తీద్దామనుకున్న కథ కొంచెం వేరు. ఇక కథ విషయానికి వస్తే.. చేతిలో ఒక్క రూపాయి తప్ప మరేమీ లేని వ్యక్తి కోటి రూపాయల ప్యాలెస్‌ కొని, తల్లికి కానుక ఇద్దామనుకున్న ఓ సాధారణ యువకుడి కథ అది. దానికి ఫాంటసీ కథని జోడించి, యముడితో ఎదురైన ఇబ్బందులను కామెడీ, సెంటిమెంట్ ను సమపాళ్లలో జోడించి ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన కల్ట్ క్లాసిక్ ఈ యమలీల.

స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా ఆడిన సినిమా..

ఇక 1994 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ చిత్రంలో హీరోగా అలీని అద్భుతంగా రిసీవ్‌ చేసుకున్నారు ప్రేక్షకులు. ఇక యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం, విలన్‌గా తనికెళ్ల భరణి, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా కోట శ్రీనివాసరావు… ఇలా సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షుకుల్ని అలరించింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ చేసిన స్పెషల్‌ సాంగ్‌ యమలీల’ చిత్రానికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా నిలిచింది. తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తో, అద్భుతమైన కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ప్రారంభమైన ‘యమలీల’ (30 Years for Yamaleela) ఎవరూ ఊహించని విజయం సాధించింది. యమలీల ఎంత పెద్ద విజయం సాధించిందంటే, ఆ రోజుల్లో తక్కువ గ్యాప్ తో దీనికి పోటీగా విడుదలైన బాలకృష్ణ నటించిన జానపదం ‘భైరవ ద్వీపం’, అలాగే వారం తర్వాత అంటే ఏప్రిల్‌ 20న నాగార్జున తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ‘హలో బ్రదర్‌’ రిలీజ్‌ అయి, రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో రన్ అవుతుండగా, ఈ రెండు చిత్రాలకు ధీటుగా, ఏప్రిల్‌ 28న విడుదలైన ‘యమలీల’ ఘన విజయం సాధించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు