48 Years for Secretary : ఓపెన్ హార్ట్ సర్జరి తర్వాత ఏఎన్నార్ నటించిన చిత్రం…యుద్ధనపూడి సులోచనారాణి కెరీర్ టర్నింగ్ మూవీ!

48 Years for Secretary : టాలీవుడ్ లో ఈ మధ్య ప్రతి సినిమాకు ఒక కొత్త స్టోరీ రైటర్ కుప్పలుగా దొరుకుతున్నారు. కానీ ఒక్క సినిమా కథకి కూడా డ్రామాకి కావాల్సిన ఎలివేషన్స్ దొరకట్లేదు. ఈ నాటి సినిమాల్లో కథంటే నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, నాలుగు డైలాగులు, మేల్ డామినేషన్… ముఖ్యంగా ఫిమేల్ లీడ్స్ ప్రధానంగా సాగే స్టార్ హీరోల సినిమాలు ఇప్పట్లో చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలు తెరకెక్కుతున్నా, ఆ సినిమాలో హీరోయిన్ కి జోడిగా చిన్న హీరోలని తీసుకుంటారు. కానీ ఆ రోజుల్లో ఇలాంటి భేదాలు పట్టించుకోకుండా, మొహమాటం లేకుండా కథలని నమ్మి ప్రాణం పెట్టి సినిమాల్లో నటించే వారు నటీనటులు. అందుకే అప్పటి నటులకు అంతటి ప్రాధాన్యత, గౌరవం ఇస్తారు ఇప్పటి ప్రేక్షకులు కూడా. ఇక అసలు విషయానికి వస్తే.. ఇంత సేపు మాట్లాడిన మాటలకు కారణం ఒక సినిమా. అదే లెజెండరీ నటి,నటులు ఏఎన్నార్, వాణిశ్రీ జంటగా నటించిన క్లాసిక్ సెక్రెటరి మూవీ. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే చాలా కథే ఉంది. ఏఎన్నార్ హీరో అయినా, వాణిశ్రీ టైటిల్ రోల్ పోషించిన సినిమా సెక్రటరీ సినిమా విడుదలై(ఏప్రిల్ 28 1976) నేటికీ 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా సినిమా గురించి కొన్ని ముచ్చట్లు.

ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత ఏఎన్నార్ నటించిన చిత్రం..

70 వ దశకంలో వరుస సినిమాలు చేస్తూ, ఎన్టీఆర్ తో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్న ఏఎన్నార్ కి 1974 లో సడన్ గా గుండెలో నొప్పి రావడంతో చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అప్పటికప్పుడు (1974 అక్టోబర్ 18) అక్కడ ఏఎన్నార్ కి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగగా, డిసెంబర్ లో ఇండియాకి తిరిగి వచ్చారు ఏఎన్నార్. ఆ తర్వాత చాలా నెలల పాటు రెస్ట్ తీసుకున్నారు. ఇక అభిమానుల కోసం అప్పటికే షూటింగ్ పూర్తి చేసిన మహాకవి క్షేత్రయ్య ని రిలీజ్ చేసారు. అయితే ఏడాదిన్నర పాటు సినిమా షూటింగ్ లకు దూరంగా ఉన్న ఏఎన్నార్ కి అసలైన సెకండ్ ఇన్నింగ్స్ సెక్రెటరీ (48 Years for Secretary) సినిమాతో ప్రారంభమైందని చెప్పాలి. అలా 1976 లో “సెక్రెటరీ” చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, నిర్మాత డీ.రామానాయుడు నిర్మించిన తెలుగు లవ్& ఫ్యామిలీ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, హీరోహీరోయిన్లు గా నటించారు. కె.వి మహదేవన్ సంగీతం సమకూర్చగా కె.ఎస్ ప్రకాష్ రావు దర్శకత్వం వహించారు.

యుద్ధనపూడి సులోచనారాణి నవల.. ఆధారంగా సెక్రటరీ..

ఇక ఆ రోజుల్లో నవలలకు అద్భుతమైన ప్రాధాన్యం ఉండేది. ఈరోజుల్లోగా టివిలు, ఫోన్ లు ఎక్కువగా లేకపోవడంతో థియేటర్లలో, సినిమాలు, పత్రికలు, నవలలు ప్రేక్షకులకు కాలక్షేపం అయ్యేవి. అలా ప్రముఖ మహిళా రచయిత యుద్ధనపూడి సులోచనారాణి రాసిన సెక్రటరీ నవల ఆధారంగా తీసిన సినిమానే ఈ “సెక్రెటరీ” చిత్రం. అంతకు ముందే మీనా, జీవన తరంగాలు వంటి చిత్రాలు ఈమె రాసిన నవలల ఆధారంగా వచ్చినా, ఈమె కెరీర్ కి ఊపునిచ్చింది మాత్రం సెక్రటరీ చిత్రమని చెప్పాలి. ఇక కథ విషయానికి వస్తే.. ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజా శేఖరం, తన సెక్రటరీ కి మధ్య జరిగిన అహంకార, ఆత్మాభిమానాల మధ్య ఘర్షణ, అలాగే అందులోంచి పుట్టుకొచ్చిన ప్రేమతో కలగలిసిన సంఘర్షణల మధ్య, వారి ప్రేమ గెలిచి ఇద్దరూ ఒక్కటేలా అయ్యారన్నదే కథ. ఇక 1976 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఏఎన్నార్ నెగిటివ్ టచ్ ఉన్న రోల్ అయినా, మొదట అంతగా టాక్ తెచ్చుకోకపోయినా, లాంగ్ రన్ లో రిపీట్ రిలీజ్ లు ఆడి అద్భుతమైన విజయం సాధించి క్లాసిక్ హిట్ గా నిలిచింది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు