Mukku Avinash: శ్రీముఖి పెళ్లి ఈ ఏడాదే.. జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ.!

Mukku Avinash.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ముక్కు అవినాష్.. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకుని అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు యాంకర్ శ్రీముఖి తో కలిసి స్టార్ మా పరివార్ షోలో సందడి చేస్తున్న ముక్కు అవినాష్ తాజాగా శ్రీముఖి పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేయగా.. అవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

యాంకర్ గానే కాదు నటిగా కూడా..

ప్రముఖ యాంకర్ శ్రీముఖి మొదటి నటిగా కెరియర్ ను ప్రారంభించి.. ఆ తర్వాత యాంకర్ గా మారింది. పటాస్ లాంటి ప్రోగ్రాం తో యాంకర్ గా అడుగుపెట్టి సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.. అంతేకాదు రెండు మూడు చిత్రాలలో హీరోయిన్ గా కూడా చేసింది.. కానీ అవేవీ ఈమె కెరియర్ కు సక్సెస్ కాలేదు. దీంతో వెండితెరన వదిలి బుల్లితెరకే పరిమితమైన శ్రీముఖి.. పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. ఒకవైపు కామెడీ ఎంటర్టైన్మెంట్ షోలతో పాటు సింగింగ్ కాంపిటీషన్ షోలకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది.. ముఖ్యంగా ఛానల్ తో సంబంధం లేకుండా జెమినీ, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా అంటూ అవకాశం వచ్చిన ప్రతి ఛానల్ లో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది.

శ్రీముఖి పెళ్లి పై అవినాష్ క్లారిటీ..

Mukku Avinash: Srimukhi's wedding is this year.. Jabardast comedian clarity.!
Mukku Avinash: Srimukhi’s wedding is this year.. Jabardast comedian clarity.!

ఇక మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రోజుకు ఒక గ్లామర్ ఫోటోషూట్ తో నెట్టింట రచ్చ చేసే ఈమె వయసు ఇప్పుడు మూడు పదుల దాటుతూ ఉండడంతో పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉంది.. దీంతో తాజాగా ఈమెతో సన్నిహితంగా ఉండే ముక్కు అవినాష్ ఇప్పుడు ఈమె పెళ్లిపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీముఖి పెళ్లిపై ముక్కు అవినాష్ కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. శ్రీముఖి తల్లిదండ్రులు ప్రస్తుతం ఈమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. మొన్నటి వరకు ఒప్పుకోని ఈమె.. ఇప్పుడు ఒప్పుకుందని.. అందుకే అన్నీ కుదిరితే ఈ ఏడాది ఆమె వివాహం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ముక్కు అవినాష్.. ప్రస్తుతం తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటే.. శ్రీముఖి కూడా పాజిటివ్ గానే ఉందని నచ్చిన కుర్రాడు దొరికితే వివాహం చేసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ముక్కు అవినాష్.

- Advertisement -

సంతోషంలో అభిమానులు..

ఇక ఈ విషయం తెలియడంతో శ్రీముఖి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు పెళ్లి పై ఎటువంటి సమాచారాన్ని ఇవ్వని శ్రీముఖి ఒక్కసారిగా ముక్కు అవినాష్..వివాహం చేసుకోబోతోంది అంటూ చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.. మరి శ్రీముఖి తనకు తగిన వాడిని సెలెక్ట్ చేసుకుంటుందో లేదో చూద్దాం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు