Pushpa 2 : కేశవ పాత్రలో సుహస్… ఎలా మిస్ అయ్యిందంటే?

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 : ది రూల్ మూవీతో ఇండియన్ సినిమా హిస్టరీని తిరిగి రాయడానికి రెడీ అవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి విపరీతమైన హైప్ ఉంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గంగమ్మ జాతర టిజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మే 1న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ అందులోని కేశవ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

కేశవ పాత్రలో సుహాస్.. జస్ట్ మిస్

ఇక పుష్ప సినిమాలో పుష్ప రాజ్ తో పాటు మరో క్యారెక్టర్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. అదే పుష్ప రాజ్ ఫ్రెండ్ కేశవ. ఈ పాత్రలో జగదీష్ అనే నటుడు నటించిన విషయం తెలిసిందే. కానీ ముందుగా కేశవ రోల్ లో హీరో సుహాస్ ను అనుకున్నారట మేకర్స్. మరి సుహాస్ ఈ రోల్ ను ఎలా మిస్ చేసుకున్నాడు? అంటే…

తాజాగా ప్రసన్న వదనం మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, డైరెక్టర్ సుకుమార్ ఆయన భార్యతో కలిసి గెస్ట్ గా హాజరయ్యారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ తన శిష్యుడు డైరెక్టర్ అర్జున్ తెరకెక్కించిన ప్రసన్న వదనం మూవీ ఈవెంట్ కు అతిథిగా ఆయన విచ్చేయడం విశేషం. అలాగే మరో డైరెక్టర్ బుచ్చి బాబు కూడా హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ వేదికపై మాట్లాడుతూ జగడం సినిమా చేస్తున్న టైంలోనే డైరెక్టర్ అర్జున్ తనను కలిశాడు అని, ఆర్య సినిమా నచ్చిందని చెప్పి తన దగ్గర పని చేయాలనుకుంటున్న విషయాన్ని తెలియజేశారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనని తన టీమ్ లో జాయిన్ చేసుకున్నానని వెల్లడించాడు సుకుమార్.

ఆ తర్వాత సుహాస్ గురించి మాట్లాడుతూ… సుహాస్ అంటే తనకు, అల్లు అర్జున్ కు చాలా ఇష్టమని చెప్పారు. ప్రసన్న వదనం మూవీ ఈవెంట్ సందర్భంగా కేశవ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు సుకుమార్. నీ ఎదుగుదల చూస్తున్నాము.. పుష్ప సినిమాలోని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవగా ముందు నిన్నే అనుకున్నాము. కానీ అప్పటికే నువ్వు హీరోగా చేస్తుండడం వల్ల ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ నువ్వు చేయడం కరెక్ట్ కాదనిపించింది అని చెప్పుకొచ్చారు సుకుమార్.

ఫ్యూచర్ నాని సుహాస్..

తనకు నాని యాక్టింగ్ అంటే బాగా ఇష్టమని, సుహాస్ ని చూస్తుంటే ఫ్యూచర్ నాని లాగే కనిపిస్తున్నాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు సుకుమార్. నాని సహజ నటుడు అయితే సుహాస్ ని మట్టి నటుడు అనాలేమో. అతను తాను చేసే పాత్రలో అంతగా ఒదిగిపోతాడు అంటూ సుహాస్ పై ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మే 3 న ప్రసన్న వదనం రిలీజ్

యంగ్ హీరో సుహాస్ హీరోగా రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన మూవీ ప్రసన్న వదనం. ఈ మూవీకి సుకుమార్ శిష్యుడు అర్జున్ వై కే దర్శకత్వం వహించగా, మే 3న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్లలో వేగం పెంచారు మేకర్స్. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరై చేసిన కామెంట్స్ సినిమాపై మరింత బజ్ ను పెంచేశాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు