Manjula Ghattamaneni: పవన్ కు రాజకీయాలెందుకు.. కామెంట్స్ వైరల్..!

Manjula Ghattamaneni.. టాలీవుడ్ లో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక పొలిటికల్ పరంగా కూడా కృష్ణ బాగానే ఎదిగారు. ఘట్టమనేని వారసుడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇండస్ట్రీలోకి చైల్డ్ యాక్టర్ గానే ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. తన కెరియర్లో ఎన్నో ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ చిత్రాలను కూడా అందించారు మహేష్ బాబు. ఇదిలా ఉండగా గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. సూపర్ స్టార్ కృష్ణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. దీంతో గత రెండు రోజులుగా ఆ వీడియోలను వైరల్ చేస్తూ.. అటు కృష్ణ ఇటు మహేష్ బాబు అభిమానులు పూర్తిస్థాయిలో పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కృష్ణ కూతురు ఘట్టమనేని మంజుల కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Manjula Ghattamaneni: Pawan why politics.. comments viral..!
Manjula Ghattamaneni: Pawan why politics.. comments viral..!

పవన్ తో సినిమా చేస్తా..

పవన్ కళ్యాణ్ సినీ హీరో గానే కాకుండా జనసేన పార్టీ అధ్యక్షుడుగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి టిడిపి తో కలిసి ప్రచారంలో చాలా చురుకుగానే పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ కృష్ణ పేరుని ప్రస్తావించడంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త కోపంగానే ఉన్నారు.. అయితే ఇలాంటి సమయంలో గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణ కుమార్తె మంజుల పవన్ కళ్యాణ్ పైన ఇలా మాట్లాడింది. గతంలో తాను డైరెక్టర్గా చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలనుకున్నాను.. కానీ అది ఎందుకో సాధ్యపడలేదు ఇప్పటికీ తన దగ్గర కథ ఉందని.. పవన్ తో సినిమా చేస్తానని కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పట్లో ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న మంజుల ఈ విషయాలను తెలియజేసింది.

పవన్ కళ్యాణ్ కి ఎందుకు రాజకీయాలు..

అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ విషయం పైన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి అసలు రాజకీయాలలోకి వెళ్లాల్సిన పనిలేదంటూ తెలుపుతోంది.ఇండస్ట్రీలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలకు ఎవరూ అసలు సాటిరారు.. అందుకే ఇప్పుడు ప్రజా సేవ చేయవలసిన అవసరం లేదు.. సింపుల్ గా సినిమాలు చేసుకుంటూ అభిమానులను మెప్పిస్తే చాలని.. ముఖ్యంగా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఇలా ఎవరు చేయలేదని.. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి వారు కూడా కొన్నేళ్ల తర్వాతే రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కూడా అలాగే చేయాల్సింది అంటూ తెలియజేసింది. ఎందుకంటే ప్రజాసేవ అనేది కచ్చితంగా ఆయన మనసు నుండే వచ్చిందని అది స్వచ్ఛమైనదిగా తనకు అనిపిస్తోంది అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది మంజుల.

- Advertisement -

మనసు మాట వినే వాళ్లంటే ఇష్టం..

తనకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఏ విధంగా పరిచయం లేదు కానీ.. ఆయనను చూస్తూ ఉంటే ఆయన రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ మనసు నుంచే వచ్చిందనిపిస్తోంది అంటూ తెలిపింది.. మనసు చెప్పిన మాట వినేవాళ్లు అంటే తనకు కూడా చాలా ఇష్టమని మంజుల తెలిపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పైన ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే కృష్ణ అభిమానులు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతుంటే ..పవన్ కళ్యాణ్ అభిమానులు మంజుల కు సంబంధించిన వీడియోలను వైరల్ చేస్తున్నారు. దీంతో సెలబ్రిటీలకు అవసరాన్ని బట్టి వాడుకునే తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు