Prathinidhi 2 : ఆ మూడేళ్ల సినిమాలే ఈ 6 ఏళ్ల గ్యాప్ కి కారణం… నారా రోహిత్ ఏ సినిమాల గురించి అన్నారు?

Prathinidhi 2 : యంగ్ హీరో నారా రోహిత్ 6 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత “ప్రతినిధి 2” మూవీతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అయితే తాజాగా జరిగిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఈ నారా హీరో తన కెరీర్లో ఎందుకు ఇంత లాంగ్ గ్యాప్ వచ్చిందో వెల్లడించారు. అందులో భాగంగానే ఆ మూడేళ్ళ సినిమాలే కారణం అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ నారా రోహిత్ ఏ సినిమాల గురించి ఇలాంటి కామెంట్స్ చేశారు ? అంటే…

నారా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టిన మొట్టమొదటి హీరో నారా రోహిత్. 2009లో బాణం మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నారా రోహిత్. అప్పటినుంచి వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈ హీరోకు బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం పడలేదు. ఇప్పటిదాకా దాదాపు 25 సినిమాల్లో నటించిన నారా రోహిత్ హిట్స్ ను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. సోలో, ప్రతినిధి, శమంతకమణి వంటి యావరేజ్ సినిమాలు తప్ప భారీ బ్లాక్ బస్టర్లు మాత్రం అందుకోలేకపోయాడు ఈ నారా హీరో. వరుసగా డిజాస్టర్లు పడుతుండడంతో 2018 తర్వాత సినిమాలకు దూరమయ్యాడు. చివరగా నారా రోహిత్ వీర భోగ వసంత రాయలు అనే సినిమాలో కనిపించారు. ఈ మూవీకి వచ్చిన రిజల్ట్ తో నిరాశకు గురైన నారా రోహిత్ ఆ తర్వాత మళ్లీ సినిమాల జోలికి వెళ్లలేదు.

ఇన్నేళ్ల గ్యాప్ ఎందుకంటే ?

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఎందుకు ఇన్నేళ్ల గ్యాప్ తీసుకున్నారు? అనే ప్రశ్న ఎదురు కాగా నారా రోహిత్ స్పందిస్తూ తనకు 16, 17, 18లలో చేసిన సినిమాలు నచ్చలేదని డైరెక్ట్ గా చెప్పేశారు. అందుకే కొంచం బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాను అని, ఇక ప్రస్తుతం నడుస్తున్న పొలిటికల్ హీట్ కు తగ్గట్టుగానే ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ తో ప్రతినిధి 2 తన దగ్గరకు రావడంతో రీ ఎంట్రీకి రెడీ అయ్యాను అన్నారు నారా రోహిత్.

- Advertisement -

ఆ మూడేళ్ళలో 14 సినిమాలు…

ఆ మూడేళ్ళలో దాదాపు 14 సినిమాలు చేశారు నారా రోహిత్. అందులో కొన్ని సినిమాల్లో మాత్రమే గెస్ట్ రోల్స్ లో మెరిశారు. అసుర, తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే, జో అచ్యుతానంద, శంకర, అప్పట్లో ఒకడుండేవాడు, శమంతకమణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, ఆటగాళ్లు, వీర భోగ వసంతరాయలు వంటి సినిమాల్లో హీరోగా నటించాడు నారా రోహిత్. మరి ఆయన నచ్చకుండానే ఇన్ని సినిమాలు చేశారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రతినిధి 2 పోస్ట్ పోన్

తాజాగా “ప్రతినిధి” సీక్వెల్ తో మళ్లీ ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రతినిధి మూవీకి ప్రేక్షకుల నుంచి అప్పట్లో మంచి ఆదరణ దక్కింది. కానీ ఈ మూవీ కమర్షియల్ గా హిట్ కాలేదు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ గా “ప్రతినిధి 2” మూవీని తెరపైకి తీసుకొస్తున్నారు. 2014లో థియేటర్లలోకి వచ్చిన ప్రతినిధి మూవీకి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించారు. ఇప్పుడు సీక్వెల్ కు జర్నలిస్టు మూర్తి దేవతపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీతోనే జర్నలిస్ట్ మూర్తి డైరెక్టర్ గా మారడం విశేషం. కుమార్ రాజా బత్తుల, సురేంద్రనాథ్ బొల్లినేని, ఆంజనేయులు శ్రీతోట ప్రతినిధి 2 మూవీని సమేతంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 25 రిలీజ్ చెయ్యాల్సిన ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు