Suprita: స్టార్ సింగర్ తో పెళ్లికి సిద్ధం అయిన స్టార్ కిడ్..!

Suprita.. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే స్టార్ కిడ్ గా గుర్తింపు తెచ్చుకుని సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి పరిచయాలు అవసరం లేదు.. ముఖ్యంగా కరోనా వచ్చినప్పుడు తన తల్లితో కలిసి ఎక్కువగా వీడియోలు చేస్తూ పాపులర్ అయిన ఈమె… వరుస ఫోటోలు షేర్ చేస్తూ గ్లామర్ ఫోటోలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసి.. సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన అందచందాలతో యువతను ఆకట్టుకున్న సుప్రీత తల్లిని మించి ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం గమనార్హం.

Suprita:Star kid ready for marriage with star singer..!
Suprita:Star kid ready for marriage with star singer..!

పెళ్లికి సిద్ధమైన సుప్రీత..

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ రచ్చ చేసే ఈమె.. తాజాగా స్టార్ సింగర్ పై తనకున్న ప్రేమను బయటపెట్టింది.. ఆయన అంటే ఇష్టమని.. అతను సింగిల్ అయితే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధం అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా ఈ విషయాన్ని యాంకర్ రీతూ చౌదరి వెల్లడించడం విశేషం..

నిజాలు చెప్పిన రీతూ చౌదరి..

అసలు విషయంలోకి వెళ్తే.. రీతూ చౌదరి దావత్ అనే టాక్ షో నడుపుతున్న విషయం తెలిసిందే.. సెలబ్రిటీలు ఇందులో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.. అందులో భాగంగానే తాజా ఎపిసోడ్ కి సింగర్ శ్రీరామ్ చంద్ర హాజరు కాగా.. శ్రీరామచంద్ర కు సంబంధించిన విషయాలను అడుగుతూనే.. మరొక పక్క ఆయనపై క్రష్ పెంచుకున్న అమ్మాయి ల గురించి కూడా వెల్లడించింది రీతూ చౌదరి..

- Advertisement -

షోలో భాగంగా రీతూ చౌదరి మాట్లాడుతూ.. మీపై ఇద్దరమ్మాయిలు క్రష్ పెంచుకున్నారు.. ఇష్టపడుతున్నారు అంటూ తెలిపింది.. ఎవరు అని అడగ్గా .. కుషిత , సుప్రీత అని తెలిపింది రీతూ చౌదరి.ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే.. శ్రీరామచంద్ర లాంటి అబ్బాయి కావాలని.. ఆయన మొగుడిలా అనిపిస్తాడని. మొగుడైతే బాగుండు అంటూ కుషిత చెప్పిందని రీతూ చౌదరి కామెంట్లు చేసింది.. దీంతో ఆడియన్స్ కేకలు వేయగా .. శ్రీరామచంద్ర మీసాలు తిప్పుతూ రెచ్చిపోయారు.. ఇక మరొక అమ్మాయి గురించి చెబుతూ ఆమె సుప్రీత.. ఎవరు నీ క్రష్ అంటే శ్రీరామచంద్ర అని తెలిపింది.. అంతేకాదు దావత్ షోకి వస్తున్నాడని ఆమెతో నేను చెబితే.. ఏ ఒక్కసారి అడుగు… నేను సింగిలే ఆయన సింగిలా కాదా అని అడగమని చెప్పిందని.. శ్రీరామచంద్ర ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధం అంటూ తెలిపిందని రీతు చౌదరి తెలిపింది..

పెళ్లిపై శ్రీరామచంద్ర క్లారిటీ..

అయితే శ్రీరామచంద్ర తాను సింగిల్ అని.. ఎవరైనా ట్రై చేసుకోవచ్చని చెప్పడంతో ఈ కామెంట్లు వైరల్ మారుతున్నాయి.. మొత్తానికైతే శ్రీరామచంద్ర ఓకే చేస్తే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెబుతున్నారు సుప్రీత.

సుప్రీత సినిమాలు..

తాజాగా ఈమె హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇటీవలే ప్రారంభం అయింది.. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్నారు.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు