Aa Okkati Adakku : ఎలక్షన్స్ టైంలో రిలీజ్ అవసరమా? అల్లరి నరేష్ రియాక్షన్ ఏంటంటే?

Aa Okkati Adakku : టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు అనే మూవీతో మేలో థియేటర్లలోకి రాబోతున్నాడు. 2023లో ఉగ్రం అనే మూవీలో కనిపించిన ఈ హీరో కాస్త గ్యాప్ తీసుకొని మరోసారి కామెడీ ఎంటర్టైనర్ జానర్ ను ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాను ఏకంగా ఎలక్షన్స్ టైంలో బాక్సాఫీస్ బరిలోకి దింపుతుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ ఒక్కటి అడక్కు మూవీని రిలీజ్ చేయడం అవసరమా? అనే ప్రశ్నకు ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు అంటే…

ఎలక్షన్స్ టైమ్ అయితే…

ఆ ఒక్కటి అడక్కు మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ సినిమా ప్రమోషన్లలో జోరు పెంచారు. వరుసగా ఇంటర్వ్యూలో ప్లాన్ చేస్తూ ఆడియన్స్ కు సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆ ఒక్కటి అడక్కు మూవీని ఎలక్షన్ టైంలో రిలీజ్ చేస్తున్నారు. ఇది సరైన సమయమే అని మీరు అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు అల్లరి నరేష్ స్పందిస్తూ… మూవీలో కంటెంట్ ఉంటే మిగతా వాటితో పెద్దగా టెన్షన్ ఉండదని చెప్పుకొచ్చారు.

అది మన చేతిలో ఉండదు..

నిజానికి ఏదీ మన చేతిలో ఉండదు అంటూ ఎలక్షన్స్ ను ముందుగా ఏప్రిల్ లో అనుకుని ఆ తర్వాత మేకు పోస్ట్ పోన్ చేశారని, అలాగే సినిమాను ఏప్రిల్ లో అనుకుంటే మార్చ్ కి వాయిదా పడిందని వివరణ ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు అల్లరి నరేష్. అప్పట్లో కుండపోత వర్షం వరదలు వస్తుంటే థియేటర్లలో జనాలు పెద్దగా ఉండరు, ఫ్రీగా టికెట్లు ఇచ్చేస్తారు అనే ఉద్దేశంతో ఓ సినిమాను చూడడానికి థియేటర్ కు వెళ్లామని, తీరా థియేటర్ ముందు చూస్తే వరదలు ఉన్నప్పటికీ కిలోమీటర్ల మేర క్యూలో నిలబడి టికెట్లు కొంటున్నారని చెప్పుకొచ్చారు ఈ అల్లరోడు. కంటెంట్ బాగుంటే జనాలు పరిస్థితులు ఎలా ఉన్నా జనాలు సినిమా చూడడానికి వెనకాడరు అనే విషయాన్ని వెల్లడించారు.

- Advertisement -

లాజిక్కే కదా…

అంతేకాకుండా 24 గంటలు ఒకే విషయం గురించి ఎవ్వరూ ఆలోచించరు కదా… ఎలక్షన్స్ అంటే పొద్దున ఓటేస్తే సాయంత్రానికి ముగిసిపోతుంది. అంతేకాకుండా ఈ సమ్మర్లో పిల్లలంతా హాలిడేస్ అంటూ ఊళ్ళకు, అమ్మమ్మల ఇళ్లకు వెళుతూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఎంటర్టైన్మెంట్ అనగానే గుర్తొచ్చేది సినిమానే. కాబట్టి సినిమాలో కంటెంట్ ఉంటే రిలీజ్ డేట్ గురించి టెన్షన్ పడక్కర్లేదని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే అల్లరి నరేష్ ఈసారి ఆ ఒక్కటి అడక్కు మూవీ కంటెంట్ మీద గట్టి నమ్మకంతో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. మరి ఈ మూవీకి థియేటర్లలో ఆడియన్స్ నుంచి ఈ ఎలక్షన్స్ వేడిలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

కొత్త రిలీజ్ డేట్…

అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు. నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించగా, చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మించారు. వాస్తవానికి మార్చి 22న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడగా, మే 3న కొత్త రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు. 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు