HBD Vijay Devarakonda : క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి నుండి హీరో దాకా.. రౌడీ హీరో ప్రయాణం..

HBD Vijay Devarakonda : టాలీవుడ్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దగా సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడున్న యూత్ స్టార్ లలో ప్లాపులు ఉన్నా తగ్గని ఫ్యాన్ క్రేజీ రౌడీ హీరో సొంతం. సినిమాలపై ప్యాషన్ తో ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ నేడు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ గా సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బర్త్ డే(మే 9) (HBD Vijay Devarakonda) ఈరోజు. ఈ సందర్బంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినీ ప్రయాణం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకుందాం.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా..

ఇక టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్ళే అయినా గుర్తింపు రావడానికి కాస్త టైం పట్టింది. “నువ్విలా” అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ, 2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోనూ చిన్న పాత్ర పోషించాడు. ఈ సినిమాతో గుర్తింపు రాలేదు కానీ, చాలా మంది జనాలకి విజయ్ దేవరకొండ స్క్రీన్ మీద కనిపించడంతో జనల దృష్టి లో పడ్డాడు. ఆ తర్వాత చాలా రోజులకు 2015 లో విడుదలైన నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో కొంచెం పేరు తెచ్చిపెట్టింది. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించాడు. కాస్త చిన్న పాత్రే అయినా, ఆ పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉండటంతో విజయ్ దేవరకొండ కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే విజయ్ దేవరకొండ సోలో హీరోగా చేసిన తొలిసినిమా “పెళ్లి చూపులు”. ఈ సినిమాకి టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకి మంచి విజయం తెచ్చి పెట్టడమే, కాకుండా మరిన్ని అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.

అర్జున్ రెడ్డి గా పాన్ ఇండియా క్రేజ్..

అయితే విజయ్ దేవరకొండ 2017 లో చేసిన “అర్జున్ రెడ్డి” సినిమా తో తన కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి విజయ్ దేవరకొండ క్రేజ్ ని విపరీతంగా పెంచేసింది. ఈ సినిమా తో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోగా, ఈ సినిమా తర్వాతే విజయ్ దేవరకొండ కి రౌడీ బాయ్ ట్యాగ్ వచ్చింది. ఇతర భాషల్లో ఈ సినిమా రీమేక్ అయినా విజయ్ దేవరకొండకే ఎక్కువ పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత గీతాగోవిందం సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో అమ్మాయిల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక నోటా సినిమా తో తమిళ్ లో అడుగు పెట్టగా, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. టాక్సీవాలా సినిమాతో మళ్లీ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈ మధ్య డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ మీద ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.

- Advertisement -

ఎప్పటికప్పుడు పలు వివాదాల్లో కూడా ఉండే విజయ్ దేవరకొండ ఎన్ని ట్రోల్స్ వచ్చినా చిల్ గా కూల్ గా కనిపిస్తాడు. అదే తన ప్రత్యేకత. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఖచ్చితంగా మళ్ళీ మంచి హిట్ అందుకుంటాడు అని ఫాన్స్ కోరుకుంటున్నారు. ఇక filmify తరపున తనకి స్పెషల్ బర్త్ డే విషెస్ ని అందచేస్తున్నాము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు