Bhaje vayuvegam : రీ ఎంట్రీ ఇస్తున్న హ్యాపీ డేస్ టైసన్.. బ్రేక్ వస్తుందా?

Bhaje vayuvegam : టాలీవుడ్ ప్రేక్షకులకు హ్యాపీడేస్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలేజ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో అన్ని పాత్రలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఆ పాత్రల్లో మైక్ టైసన్ పాత్ర కూడా ఒకటి. ఇక ఈ పాత్రలో నటించిన రాహుల్ హరిదాస్ అద్భుతంగా నటించాడు. ఆ పాత్ర సినిమాలో ఎంతో టాలెంటెడ్ గా, అమాయకంగా, కూల్ గా ఉంటుంది. ఇక ఆ సినిమా తర్వాత రాహుల్ తన రియల్ లైఫ్ నేమ్ కన్నా, రీల్ లైఫ్ పేరుతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అయితే ఈ సినిమా తర్వాత ఈ నటుడు హీరోగా పలు సినిమాలు చేసాడు. అయితే ఏ సినిమా కూడా అంతగా బ్రేక్ ఇవ్వలేదు. చివరగా ఏడేళ్ల కింద వెంకటాపురం అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

భజేవాయుపుత్రం తో రీ ఎంట్రీకి సిద్ధం !

టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ బెదురులంక తో హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు “భజే వాయువేగం” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం “భజే “వాయువేగం”. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక కార్తికేయ హీరోగా వస్తోన్న “భజే వాయువేగం” సినిమాలో రాహుల్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ భజే వాయు వేగం సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీకి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

విలన్ గానా? లేక మరేదైనా ప్రత్యేక పాత్ర?

ఇక భజేవాయువేగం (Bhaje vayuvegam ) సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే, అంటే మే 31న థియేట్రికల్ రిలీజ్ కానుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఆ మధ్య వచ్చిన ఫస్ట్ లుక్ లో క్రికెట్ బ్యాట్‌తో కార్తికేయ పరుగులు పెడుతున్నట్టుగా, మరోవైపు పెద్ద మొత్తంలో డబ్బు ఎగరడం కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో రాహుల్ టైసన్ ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు అనేది తెలీదు. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడా? లేదా ఇంకేదైనా ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నాడా? అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమాతో తన కెరీర్ కి మంచి బ్రేక్ వస్తుందని రాహుల్ ఎదురుచూస్తున్నాడు. మరి ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇస్తున్న ఈ నటుడికి భజేవాయువేగం సినిమా ఎంత వరకు గుర్తింపు తెస్తుందో, మళ్ళీ వరుస అవకాశాలు తెస్తుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు