Venkatesh Maha: ఆ నెగెటివిటీ ఇంకా పోలేదు

Venkatesh Maha: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అలానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి కూడా వాళ్లకి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక పోవడం వలన, ఏ విషయంపై ఎలా స్పందించాలో తెలియకపోవడం వలన చాలా ట్రోల్స్ గురయ్యారని చెప్పొచ్చు. గతంలో చాలామంది దర్శకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, హీరోలు కావచ్చు ఇలా చాలామంది కొన్ని ప్లాట్ఫార్మ్స్ లు కొన్ని మాటలు మాట్లాడటం వలన వాళ్ళకంటూ కొంత నెగిటివిటిని మూటగట్టుకున్నారు.

ఇక రీసెంట్ టైమ్స్ లో వెంకటేష్ మహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేరాఫ్ కంచరపాలెం అనే ఒక అద్భుతమైన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్ మహా. ఆ సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ కూడా రాబట్టింది.అప్పటినుంచి వెంకటేష్ మహా పైన అందరికీ ఒక రకమైన ఆసక్తి ఉండేది. వెంకటేష్ మహా సినిమా అంటే ఒక క్యూరియాసిటీ ఉండేది. ఆ సినిమా తర్వాత వెంకటేష్ మహా చేసిన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మలయాళం సినిమా కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే కరోనా టైం కావటం వలన ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కే జి ఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా చాలామందికి ఎక్కలేదు అనేది వాస్తవం. అయితే కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసి అద్భుతమైన విజయాన్ని అందించారు. అయితే ఈ సినిమా గురించి గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు వెంకటేష్ మహా. ఈ సినిమా గురించి మాట్లాడటం ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా వెంకటేష్ మహా కి ఒక రకమైన నెగిటివిటీని తీసుకొచ్చాయి.

- Advertisement -

ఆ తర్వాత వెంకటేష్ మహా కి అవకాశాలు కూడా రావడం తగ్గిపోయాయి అని చెప్పొచ్చు.తన రెండవ సినిమా తర్వాత ఇప్పటివరకు వెంకటేష్ మహా తన మూడవ సినిమాని పట్టాలెక్కించలేకపోయాడు. దీనికి కారణం వెంకటేష్ మహా కి ఉన్న ఈ నెగెటివిటీ అని చెప్పొచ్చు. ఇకపోతే రీసెంట్ గా ఆరంభం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. వెంకటేష్ మహా కంటే ఉన్న సీనియర్ డైరెక్టర్లు తెలుగు సినిమాని ప్రపంచ పటంలో పెడుతున్నారు. కానీ మేమేం చేస్తున్నామో చెప్పాలనుకుంటున్నాను.

మేము తెలుగు సినిమాని నెక్స్ట్ జనరేషన్ కి చూపించాలనుకుంటున్నాము. అలాంటి సినిమాలు మేము తీస్తున్నాము అని చెప్పుకొచ్చాడు. అలానే ఆరంభం కూడా అలాంటి సినిమా అంటూ చెప్పాడు. అయితే ఈ స్టేట్మెంట్ పై చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు నువ్వు తీసినవి ఒకటే సినిమా ఇంకొకటి రీమేక్ నువ్వెందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అంటూ అప్పటి నెగెటివిటీని ఇంకా క్యారీ చేస్తూ ఇప్పటికీ వెంకటేష్ మహాను తిడుతున్నారు. ఏదేమైనా వెంకటేష్ మహా ఈ విషయం పైన అప్పట్లోనే స్పందించారు మళ్ళీ విషయం పైన స్పందించినా కూడా కోరి కెలక్కునట్లు ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు