Vijay Devarakonda: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విజయ్ దేవరకొండ ఒకరు. వరుసగా ప్రస్తుతం డిజాస్టర్స్ అందుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు విజయ్ దేవరకొండను యంగ్ హీరోస్ లో ఒకరు అని అంటున్నాం. కానీ ఒకప్పుడు యంగ్ సెన్సేషన్ అనేవాళ్ళు. ఎందుకంటే విజయ కెరియర్ లో అంత పెద్ద హిట్ అయింది అర్జున్ రెడ్డి అనే సినిమా. అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినిమా పై చూపించిన ఇంపాక్ట్ మాటల్లో చెప్పలేము అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో వచ్చిన శివ సినిమా తర్వాత అంతటి ఇంపాక్ట్ ను ఆ సినిమా క్రియేట్ చేసింది.
ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఆ సినిమా ఆడటానికి కారణం ఆ సినిమా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అని కూడా చెప్పొచ్చు. అయితే వాస్తవానికి ఆ క్యారెక్టర్ రాసిన సందీప్ రెడ్డి వంగ లో కూడా అదే ఫైర్ ఉంటుంది. ఇది మనం చాలా ఇంటర్వ్యూస్ లో గమనించవచ్చు. ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమాకి రీమేక్ గా కబీర్ సింగ్ సినిమా ప్రొమోషన్స్ లో ఒక బాలీవుడ్ జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తుండగా ఆ జర్నలిస్ట్ వినకపోవడంతో ఆన్ ద స్టేజ్ ఫైర్ అయ్యారు సందీప్ రెడ్డివంగా. అప్పటినుంచి సందీప్ రెడ్డి వంగ అంటే ఏంటో బాలీవుడ్ లో కూడా తెలిసి వచ్చింది.
ఇక అర్జున్ రెడ్డి సినిమా టైమ్ నుంచే విజయ్ దేవరకొండ స్టేజ్ పైన మాట్లాడిన మాటలు మన ఎవరికి తెలియనివి కాదు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే నేను కొంతమందికి అపాలజీ చెప్పాలనుకుంటున్నాను అంటూ విజయ మాట్లాడిన మాటలు, అయితే సినిమాలో డైలాగ్ ను సెన్సార్ వాళ్ళు మ్యూట్ చేయించారని ఆన్ ద స్టేజ్ పై అరిచి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ డైలాగ్ చెప్పించడం. ఇవన్నీ కూడా కొంచెం అతిలా అనిపించాయి. వాస్తవానికి సినిమా హిట్ అవ్వటం వలన అదంతా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సినిమా హిట్ అవ్వకపోయి ఉంటే విజయ్ ను అప్పుడే ట్రోల్ చేసేవారు.
ఇక విజయ్ ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో కూడా పలుమార్లు చాలా స్టేట్మెంట్ ఇస్తూ వచ్చాడు. అయితే వీటి వలన ట్రోల్ కూడా గురయ్యాడు. ఇకపోతే విజయ్ కెరియర్ లో వచ్చిన అతి పెద్ద డిజాస్టర్ లైగర్. ఈ లైగర్ సినిమా ఇంటర్వ్యూస్ టైంలో ఈ సినిమా రిజల్ట్ గురించి ముందుగా మాట్లాడినప్పుడు నేను ఈ సినిమా రిజల్ట్ 200 కోట్లు దగ్గర్నుంచి లెక్కపెట్టడం మొదలుపెడదాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ గా మిగిలింది అప్పుడు కూడా విజయ్ ను ట్రోల్ చేశారు.
అలానే లైకర్ ఒక ప్రెస్ మీట్ లో కూడా జర్నలిస్ట్ ముందు టేబుల్ పైన కాళ్ళు పెట్టి కూర్చున్నాను, మీరు కూడా కాళ్లు పెట్టి అడగండి అంటూ చెప్పడం. అలానే రీసెంట్ గా కూడా అప్పుడు 200 కోట్లు నుంచి అన్నాను. ఈ సినిమా కాకపోయినా కూడా నా ఏదో ఒక సినిమా 200 కోట్లు కచ్చితంగా రీచ్ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక క్యారెక్టర్ లో ఒదిగిపోవడంలో కానీ, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యూలేషన్ విజయ్ వి అద్భుతంగా ఉంటాయి. అయితే కొంతమంది ఒపీనియన్స్ ప్రకారం విజయ్ కొంచెం ఆన్ ద స్టేజ్ & ఇంటర్వూస్ లో అతి తగ్గించుకుంటే మంచిది అని ఫీల్ అవుతూ ఉంటారు.