Sai Pallavi: తండేల్ మూవీ టీం క్యూట్ గిఫ్ట్

Sai Pallavi:  ఒకప్పుడు కేవలం తెలుగు సినిమాలు చూడటానికి మాత్రమే అవకాశం దొరికేది. కానీ ఇప్పుడు ఒక గొప్ప సినిమా ఏ భాషలో ఉన్న చూడగలుగుతున్నాము అంటే దానికి కారణం ఓటిటి అని చెప్పొచ్చు. ఇకపోతే మలయాళం లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ప్రేమమ్. ఈ సినిమాతోనే చాలామంది మలయాళం సినిమాలు చూడటం మొదలు పెట్టారని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సినిమాని తెలుగులో ప్రేమమ్ పేరుతో రీమేక్ కూడా చేశారు.

ప్రేమమ్ సినిమాలో నటించింది సాయి పల్లవి. అయితే మలార్ అనే పాత్రలో నటించిన సాయి పల్లవికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమాతోనే సాయి పల్లవి మంచి ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారని చెప్పొచ్చు. అయితే తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చింది. మొదటి సినిమాతోనే చాలామంది ఆడియోన్స్ ను ఫిదా చేసింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రోజుల తర్వాత శేఖర్ కమ్ములకు కూడా మంచి హిట్ పడింది అని చెప్పవచ్చు. అయితే వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ ఫిలిం అని కూడా చెప్పొచ్చు. ఈ సినిమాతో చాలామంది సాయి పల్లకి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమా తర్వాత సాయి పల్లవి కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా అయితే పడలేదు అని చెప్పొచ్చు.

ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన పడి పడి లేచే మనసు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మారింది. చూడ్డానికి ఆ సినిమా బాగానే ఉన్నా కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. మళ్ళీ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమాతో మంచి హిట్ అందుకుంది సాయి పల్లవి. అలానే నానితో చేసిన శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా మంచి పేరును తీసుకొచ్చింది. అయితే సాయి పల్లవి హీరోయిన్ గా చేసిన సినిమాలు ఫెయిల్ అయినా కూడా సాయి పల్లకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. దీనికి సాయి పల్లవి పర్సనల్ ఆటిట్యూడ్. ప్రస్తుతం సాయి పల్లవి తండేలు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈరోజు సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక వీడియో చేసింది చిత్ర యూనిట్.

- Advertisement -

మొదటిగా సాయి పల్లవి నటించిన కొన్ని సినిమాల్లోని క్యూట్ వీడియో కటింగ్స్ చేసి, ఆ తర్వాత తండేల్ సినిమాలోని సాయి పల్లవి చేసిన కొన్ని అల్లరి పనులను, చిలిపి పనులను, అలానే పర్ఫామెన్స్ వీడియోస్ ను కలిపి చిత్ర యూనిట్ ఒక మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో సాయి పల్లవి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తుంటే సినిమాలో కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయని అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు