Vijay Devarakonda Latest Film: విజయ్ దేవరకొండ సరికొత్త సినిమా పోస్టర్ రిలీజ్ .. ఫ్యాన్స్ కి పూనకాలే..!

Vijay Devarakonda Latest Film: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ హీరో ఇటీవల ఏ ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకుడి ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు. దీంతో తన తదుపరిచిత్రం పై భారీ హైప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్.

ఇక నేడు అనగా మే 9వ తారీఖున విజయ్ దేవరకొండ బర్తడే సందర్భంగా తన లేటెస్ట్ ఫిలింని అనౌన్స్ చేశారు మేకర్స్. ఎస్ ఎస్ వి క్రియేషన్స్ సంస్థ ఈ సరికొత్త పోస్టర్ను విడుదల చేసింది. ” కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే ” అనే డైలాగ్ తో ఈ మూవీ పోస్టర్ను విడుదల చేశారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు శిరీష్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Vijay Devarakonda Latest Movie Poster Release
Vijay Devarakonda Latest Movie Poster Release

ఇక ఈ చిత్రానికి రవి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని తెలుగు తో పాటు హిందీ మరియు తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్లో వెల్లడించారు. ఈ పోస్టర్లో ఒక కత్తితో రక్తం పారుతున్న సీన్స్ మనం చూడవచ్చు. ఇక ఈ సినిమా పోస్టర్ని చూస్తుంటే పక్క సూపర్ హిట్ అనేలాగానే అనిపిస్తుంది. మరి ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడు కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు