HBD Sai Pallavi: సాయి పల్లవికి ఇతర హీరోయిన్స్ కి మధ్య తేడా ఇదే..!

HBD Sai Pallavi.. టాలీవుడ్ లో నాచురల్ బ్యూటీగా మంచి పేరు సంపాదించింది హీరోయిన్ సాయి పల్లవి.. తెలుగులో మొదట ఫిదా సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగు అమ్మాయిగా ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసుకుంది. ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలతో సరికొత్త కథాంశాలతో సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటుంది. ఈ రోజున సాయి పల్లవి 32వ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి చూద్దాం.

HBD Sai Pallavi: This is the difference between Sai Pallavi and other heroines..!
HBD Sai Pallavi: This is the difference between Sai Pallavi and other heroines..!

సాయి పల్లవి కెరియర్..

సాయి పల్లవి తమిళనాడులోని నీలగిరి జిల్లాలో కోటగిరిలో జన్మించింది.. సెంతమారియా కన్నన్ , రాధ ల యొక్క మొదటి సంతానం సాయి పల్లవి.. ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు పూజా కన్నన్.. గడిచిన కొద్ది రోజుల క్రితం ఆమెకు వివాహం కూడా చేసింది సాయి పల్లవి. సాయి పల్లవి తల్లి కూడా ఒక క్లాసికల్ డాన్సర్ కావడంతో సాయి పల్లవికి చిన్న వయసు నుంచి డాన్స్ మీద మంచి పట్టు ఉంది.. డాన్స్ కోసం ఆమె ఎక్కడా కూడా శిక్షణ తీసుకోలేదట. కేవలం కాలేజీలలో, స్కూళ్లలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలలో మాత్రమే పాల్గొనేది.

మొదటి అవకాశం..

2005 లో కస్తూరి మాన్ చిత్రంలో స్కూల్ పిల్లలాగా కూడా నటించింది. అయితే ఆ సమయంలో తను చదువుకుంటున్నందువల్ల సినిమాలను ఒప్పుకోలేకపోయానని.. అందుకే కాస్త ఆలస్యంగానే ఎంట్రీ ఇచ్చానని వెల్లడించింది. ముఖ్యంగా ఈమె చదువు కోసం జార్జియా వరకు వెళ్లిందట.. అలా మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న సమయంలోనే ప్రేమమ్ సినిమా డైరెక్టర్ తనకు ఫోన్ చేసి నటించమని సలహా ఇచ్చారట. దీంతో పరీక్షలు పూర్తి అయిన వెంటనే షూటింగ్లో పాల్గొంటానని డైరెక్టర్ కి తెలియజేసిందట. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ కూడా ప్లాన్ చేసుకొని తనకు ప్రేమమ్ చిత్రంలో అవకాశాన్ని కల్పించారు. ఈ చిత్రం 2015లో మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

- Advertisement -

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి..

ఇక తర్వాత ఈమె రేంజ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. తెలుగులో కూడా ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. మంచి పాపులారిటీ అందుకుంది. తానే సొంతంగా కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పుకుంది సాయి పల్లవి.. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి రా బాబు అనేంతలా అభిమానులను సంపాదించుకుంది.. సాయి పల్లవి డాన్స్ పర్ఫామెన్స్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మేకప్ వేసుకోకుండా చాలా సింపుల్ గానే కనిపిస్తూ ఇతర హీరోయిన్లతో డిఫరెంట్ తో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుంది సాయి పల్లవి.. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ తనకు కథ నచ్చకపోతే అసలు ఒప్పుకోదు.. ఎంతటి స్టార్ హీరోలైనా సరే వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ..సాయి పల్లవి సినీ కెరియర్ విషయానికి వస్తే.. శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, విరాటపర్వం, పడి పడి లేచే మనసు, మారి -2,NGK, గార్గి తదితర చిత్రాలలో నటించింది.. ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది.

సాయి పల్లవి అవార్డులు..

సాయి పల్లవి అవార్డుల విషయానికి వస్తే.. లవ్ స్టోరీ ఫిదా సినిమాలకు బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు .. 2017 లో కలి చిత్రానికి మోస్ట్ పాపులర్ యాక్టర్ కింద..2016 లో హానర్ స్పెషల్ జ్యూరీ కింద..2022 లో క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు తెలుగు లో ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు