Aha Indian Idol Season 3: ఇండియన్ ఐడల్ 3 ఆడిషన్స్ స్టార్ట్.. పోటీలో ఏకంగా 5000 మంది గాయకులు..!

Aha Indian Idol Season 3: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మరియు ప్రేమికుల నుంచి ప్రశంసలు పొంది మంచి టిఆర్పి రేటింగ్ దక్కించుకున్న షోస్ లో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో కూడా ఒకటి. ఇప్పటికే రెండు సీజన్స్ తో ప్రేక్షకుల హృదయాలను గలుచుకున్న ఈ రియాల్టీ షో మూడో సీజన్ కోసం ఏర్పాటు చేసిన వేదిక పులకించింది. ప్రపంచంలోని స్పాట్లైట్ మరింత ప్రకాశంవంతంగా మారింది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కోసం ఎదురు చూస్తున్న ప్రయా ణం ఘనంగా ప్రారంభమైంది.

Indian Idol 3 auditions start.. 5000 singers together in the competition
Indian Idol 3 auditions start.. 5000 singers together in the competition

ఈ ప్రారంభమైన శక్తివంతమైన తరంగాలు హైదరాబాద్ మరియు యూఎస్ఏ లో ప్రారంభాన్ని చోటు చేసుకున్నాయి. ఎప్పుడు లేని విధంగా అమెరికాలోని న్యూ జెర్సీలో మే 4న సీజన్ 3 కి సంబంధించిన ఆడిషన్స్ జరిగాయి. అదేవిధంగా మే ఐదవ తారీఖున హైదరాబాద్లో ఆడిషన్స్ జరిగాయి. ఇక వీటికి మంచి స్పందన కూడా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండియన్ ఐడల్ 2 కు వచ్చిన అపూర్వమైన స్పందనను ఆధారంగా తీసుకుని మూడో సీజన్ ను మరింత రసవత్తంగా రూపొందించేందుకు రెడీ అయ్యారు మేకర్స్.

ఇక ఈ మూడో సీజన్ ఆడిషన్స్ లో ఏకంగా 5000 మంది సింగర్స్ పాల్గొన్నారు. ఇక ఫైనల్ లిస్టులో మాత్రం టాప్ 12 కోసం వారు అత్యుత్తమైన ప్రతిభను చాటారు. ఇక త్వరలోనే ఈ షోకి సెలెక్ట్ అయిన వారి వివరాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మరియు గీతా మాధురి, కార్తీక్ జడ్జ్ ‌ లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ షోలో హాజరవుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ముగిసిన రెండు సీజన్లు అయితే భారీ టిఆర్పి రేటింగ్ దక్కించుకున్నాయి. మరి ఈ మూడో సీజన్ ప్రేక్షకులను ఎంతమేరా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు