HBD Sai pallavi : యువ నాట్య మయూరి.. సాయి పల్లవి…

HBD Sai pallavi : సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ తో కాకుండా నటనకు ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లు చాలా మంది ఉంటారు. అందులో తెలుగు వాళ్లకు ముందు గుర్తొచ్చే పేర్లు మహానటి సావిత్రి, సౌందర్య. ఆ తర్వాత ఈ జెనరేషన్ లో అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ “సాయి పల్లవి”. పేరుకి మలయాళం అమ్మాయే అయినా తెలుగు హైబ్రిడ్ పిల్ల గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మామూలుగా తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్‌ అంటేనే గ్లామర్‌కు‌ కేరాఫ్‌ అని చాలా మంది అంటుంటారు. పైగా ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు మేకప్‌ లేనిదే కెమెరా ముందుకు రారు. కానీ ఈ హీరోయిన్‌ వారికి భిన్నం. తనకంటూ కొన్ని పరిధులు ఏర్పరుచుకుంది. ఎంత స్టార్‌ హీరో, పెద్ద డైరెక్టర్‌ అయినా తన రూల్స్‌ ఫాలో అవ్వాల్సిందే. లేదంటే సినిమా అయినా వదులుకుంటుంది గాని, తన లిమిట్స్ దాటి గ్లామర్ షో చేయదు. పైగా పాత్ర నచ్చితే ఎంత కష్టమైనా భరిస్తుంది. ఇండస్ట్రీ లో ఎన్నో షరతులు పెట్టుకుని ఉన్నా సాయి పల్లవి నేడు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. తెరపై నేచురాలిటీ కి కేరాఫ్ గా నిలిచి టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ అని పిలుచుకునే “సాయి పల్లవి” (HBD Sai pallavi) (మే 9) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సాయి పల్లవి సినీ కెరీర్‌ ఓ లుక్కేద్దాం..

హైబ్రిడ్‌ పిల్ల గా ఫేమస్..

తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈమె డైలాగ్ లోనే .. ‘హైబ్రిడ్‌ పిల్లా.. ఒక్కటే పీస్‌’ అన్నమాట. ‘లేడీ పవర్ స్టార్’‌ బిరుదు అందుకున్న వన్ అండ్‌ ఓన్లీ హీరోయిన్‌ సాయి పల్లవి. అనడం సందేహం లేదు. అయితే నిజానికి డాక్టర్‌ చదివిన సాయి పల్లవి, కాలేజ్ టైం లో అనుకోకుండా సినిమాలోకి వచ్చేసింది. ఒకసారి ఎంట్రీ ఇచ్చాక ఇక్కడ తనదైన నటన, డ్యాన్స్‌ స్కిల్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సాయి పల్లవి 1992 మే 9న తమిళనాడులో కోయంబత్తూర్‌లో హిందూ ఫ్యామిలీకి చెందిన సెంథామరై కన్నన్ – రాధలకు దంపతులకు జన్మించింది. ఇక చిన్నతనామమంతా కోయంబత్తూర్ లోనే గడవగా, టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీ లో 2016లో మెడిసిన్‌ పూర్తి చేసింది. అయితే ఇక సాయి పల్లవి నటిగా కంటే ముందు డ్యాన్సర్‌ అనే విషయం తెలిసిందే. మొదట తమిళ్ విజయ్ టీవీలో ‘ఉంగలిల్ యార్ అడుత ప్రభుదేవా’ అనే డాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. ఆ తర్వాత తెలుగులో 2009లో ETVలో ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో (D4)లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అంతకు ముందు ఓ రెండు చిన్న చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. ఇక ఈటీవీలో D4 షో టైటిల్‌ గెలిచిన సాయి పల్లవి మలయాళంలో ప్రేమమ్‌ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. తొలి సినిమాకే ఎంతో గుర్తింపు పొందిన ఈమె తెలుగులో ‘ఫిదా’ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. ఈ మూవీలో భానుమతి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. పైగా ఫస్ట్‌ సినిమాకే స్వయంగా తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకుంది. “భానుమతి.. హైబ్రిడ్‌ పిల్లా.. ఒక్కటే పీస్‌” అంటూ కుర్రకారును ఫిదా చేసింది.

పాన్ ఇండియా క్రేజ్..

ఇక ఫిదా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు సాయి పల్లవి(HBD Sai pallavi). ఆ తర్వాత తెలుగులో ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’, ‘పడి పడి లేచే మనసు ‘, ‘విరాట పర్వం’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తమిళ్ లో ‘మారి 2’లో తో అక్కడా క్రేజ్ సంపాదించింది. అప్పట్లో వచ్చిన రౌడీ బేబీ సాంగ్‌ యూట్యూబ్‌ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చివరగా ‘లవ్‌ స్టోరీ’ సినిమా లో నటించి మెప్పించింది. అంతకు ముందు నానితో ‘శ్యామ్‌ సింగరాయ్’‌ సినిమాలో నటించిన సాయి పల్లవి ఆ సినిమాలో దేవదాసి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను కట్టిపారేసింది. కెరీర్ బిగినింగ్ నుండి తక్కువ సినిమాలే చేస్తూ, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలే ఎంచుకుంటూ, సెలక్టివ్‌ రోల్స్‌, సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక ఇప్పుడున్న హీరోయిన్లలో గ్లామర్‌ షో కి దూరంగా ఉంటూ కమర్షియల్‌ హిట్స్‌ అందుకోవడం సాయి పల్లవికే సాధ్యమైంది. ఇక సౌత్ ఇండస్ట్రీలో తనదైన మార్క్‌తో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సరసన తండేల్‌, హిందీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ్‌ చిత్రంలో సీత పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇక నేటితో 32వ బర్త్ డే జరుపుకుంటున్న సాయి పల్లవి కి బర్త్ డే విషెస్ ని అందచేస్తూ, కెరీర్ లో మరిన్ని సినిమాలు చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు