Aparichithudu Re-Release : అపరిచితుడు మళ్ళీ వస్తున్నాడు

Aparichithudu Re-Release: రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మొదలైన ఈ ట్రెండ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తో పీక్ కి వెళ్లిపోయింది అని చెప్పొచ్చు. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మొదట ఒక్కడు అనే సినిమాని రిలీజ్ చేశారు. ఒక్కడు సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబుకి ఒక స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమా ఒక్కడు. ఈ సినిమా మొత్తం ఒక ఇన్సిడెంట్. ఈ కథను నమ్మి మహేష్ బాబు చేయడం వలన ఈ సినిమాతోనే మహేష్ బాబుకి స్టార్ ఇమేజ్ అనేది వచ్చింది.

అయితే ఒక్కడు సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కేవలం మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా వచ్చి ఈ సినిమాను ఆదరించారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన పోకిరి సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే సెప్టెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు మరియు జల్సా సినిమాలను రిలీజ్ చేశారు. తమ్ముడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఒకప్పుడు టీవీలో తమ్ముడు సినిమా చూసి పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఇజం చేసిన ఫ్యాన్స్ అందరూ కూడా, తమ్ముడు సినిమా మళ్లీ థియేటర్లో రిలీజ్ అవ్వటం ఆ సినిమాను చూసి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. ఇక జల్సా సినిమా కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. జల్సా సినిమా సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలియంది కాదు. దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ సాంగ్స్ దేవీ కెరియర్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. అయితే జల్సా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా థియేటర్ ను ఒక కాన్సర్టు గా మార్చేసారని చెప్పవచ్చు.

- Advertisement -

ఆ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలకి సరైన ఆదరణ దక్కలేదు అని చెప్పాలి. అయితే కేవలం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే ఒక వైబ్ ఉంటుందని చెప్పొచ్చు. ఇకపోతే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన రఘువరన్ బీటెక్, త్రీ, సెవెన్ జి బృందావన్ కాలనీ వంటి సినిమాలకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలానే సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాని కూడా పెద్ద ఎత్తున అభిమానులు సెలబ్రేట్ చేశారు అని చెప్పొచ్చు.

ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతుంది. శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సినిమాని ఇప్పుడు మే 17న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకప్పుడు చాలామంది టీవీలో ఈ సినిమాను చూసి బాగుంది అని ఫీల్ అయ్యారు. అలానే ఇప్పుడు మళ్లీ అదే ఫీల్ ను థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారా లేదని తెలియాలంటే కొంతవరకు వెయిట్ చేయక తప్పదు. హరీష్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు