Vijay Devarakonda Bday Treat : విజయ్ బర్త్ డేకు ట్రిపుల్ ధమాకా… గెట్ రెడీ రౌడీ బాయ్స్

Vijay Devarakonda Bday Treat : విజయ్ దేవరకొండ పుట్టినరోజు సమీపిస్తున్న తరుణంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లపై తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్కంఠత నెలకొంది. వరుస డిజాస్టర్ సినిమాల తర్వాత విజయ్ స్టార్ పవర్ తగ్గుతోందని కొందరు చెబుతున్నప్పటికీ, రౌడీ హీరో చేతిలో ఏకంగా మూడు మంచి ప్రాజెక్ట్‌ లు ఉండడం విశేషం. ఈసారి రౌడీ హీరో బర్త్ డే ట్రీట్ గా ట్రిపుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ట్రిపుల్ ట్రీట్ రెడీ

మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆరోజు రౌడీ బాయ్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా ఏకంగా మూడు అప్డేట్స్ రాబోతున్నట్టు సమాచారం. VD12 నుంచి టైటిల్, డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయనున్న నెక్స్ట్ మూవీ కాన్సెప్ట్ పోస్టర్, అలాగే ఆ తరువాత విజయ్ చేయబోతున్న మరో మూవీపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది.

VD12 టైటిల్ అనౌన్స్మెంట్

రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ మూవీతో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేశారు. ఇప్పుడు విజయ్ ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘VD12’ అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ టైటిల్ ను విజయ్ పుట్టిన రోజున అఫిషియల్ గా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా స్పై థ్రిల్లర్‌గా ఉండనుందని టాక్ నడుస్తోంది. ఇందులో హీరోయిన్ ఎవరు అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

- Advertisement -

నెక్స్ట్ మూవీ కాన్సెప్ట్ పోస్టర్

ఇక రెండవ ట్రీట్ విషయానికొస్తే.. నిర్మాత దిల్ రాజు ‘ది ఫ్యామిలీ స్టార్’ తర్వాత మళ్లీ విజయ్‌తో కలిసి మరో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి దర్శకుడు రవి కిరణ్ కోలా వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ మాస్ రూరల్ డ్రామాగా రూపొందుతుండగా, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విజయ్ దేవరకొండ బర్త్ డే రోజు ఆవిష్కరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్న ప్రచారం జరుగుతోంది.

కొత్త మూవీ అనౌన్స్మెంట్

విజయ్ దేవరకొండ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో మరో మూవీ చేయడానికి రెడీగా ఉన్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2018లో వీరిద్దరి కాంబవనేషన్ లో వచ్చిన టాక్సీవాలా మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి విజయ్, రాహుల్ కాంబో రిపీట్ కాబోతోంది అనే వార్తలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అనౌన్స్మెంట్ రౌడీ హీరో పుట్టిన రోజున అఫిషియల్ గా రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే విజయ్ బర్త్ డే ట్రీట్ గా రాబోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుండగా, ఈ మూడు అప్డేట్ లలో ఒక్కదానిపై కూడా మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు.

విజయ్ దేవరకొండ చివరిసారిగా పరశురామ్ దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీ స్టార్’లో మృణాల్ ఠాకూర్‌తో కలిసి నటించాడు. ఈ మూవీ తీవ్రంగా నిరాశ పరిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు