Indian 2 postponed : ఇండియన్ 2 వాయిదా… ఆ రోజు ఏ మూవీ రిలీజ్ కాబోతోందో తెలుసా?

Indian 2 postponed : ఇటీవల కాలంలో సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో నెలకొన్నంత కన్ఫ్యూజన్ ఇంతకు ముందెన్నడూ జరగలేదు. అఫిషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా ఇండియన్ 2 వంతు వచ్చింది. జూన్ ను కల్కికి వదిలేసి ఇండియన్ 2 కోసం కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ వెతుక్కుంటున్నారు అనే వార్త వైరల్ అవుతోంది. మరి ఇండియన్ 2 రిలీజ్ డేట్ ను ఏ స్టార్ వాడుకోబోతున్నాడు ? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే..

ఇండియన్ 2 వాయిదా..

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, జూన్ లో మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. అయితే ఇప్పటిదాకా డేట్ ను మాత్రం వెల్లడించలేదు. జూన్ 13న ఇండియన్ 2 థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే కల్కి మూవీని జూన్ 27న రిలీజ్ చేయబోతున్నామని తాజాగా ప్రకటన రావడంతో ఇండియన్ 2 మేకర్స్ మూవీని మరింత ఆలస్యంగా థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ రూమర్స్ ప్రకారం ఇండియన్ 2 మూవీ జూలైలో రిలీజ్ అయితే, ఈ మూవీకి ముందుగా అనుకున్న విడుదల తేదీని ఏ స్టార్ హీరో తీసుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇండియన్ 2 ప్లేస్ లో రాయన్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కొత్త చిత్రం రాయన్. మూవీ లవర్స్ 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న  ప్రాజెక్ట్‌లలో ఇది కూడా ఒకటి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం  ప్రకటించినప్పటి నుండే విపరీతమైన హైప్ ను పెంచేసింది. అయితే ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి కానీ చిత్రబృందం దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారమ జూన్ 13న రాయన్‌ని థియేటర్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.  దీంతో ధనుష్ దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటిస్తున్న రాయన్ పెద్ద పోటీ లేకుండా విడుదలయ్యే అవకాశం ఉంది. ధనుష్ అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

డైరెక్టర్ గా ధనుష్ రెండవ మూవీ

ఎస్జె సూర్య , సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, అపర్ణా బాలమురళి, దుషార విజయన్, వరలక్ష్మి శరత్‌ కుమార్, ప్రకాష్ వంటి అనేక మంది ప్రతిభావంతులైన నటీనటులు నటిస్తున్న చిత్రం రాయన్. ఈ మూవీకి స్వయంగా ధనుష్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. 2017లో వచ్చిన పా పాండి చిత్రం తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం రాయన్. దర్శకుడిగా మొదటి చిత్రం ధనుష్ కు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో నిత్యా మీనన్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందని పుకారు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వయంగా సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు