Kubera Update : మూవీ కోసం 10 గంటలు భరించలేని కంపులో ధనుష్… హ్యాట్సాఫ్ చెప్తున్న ఫ్యాన్స్

Kubera Update : తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పటిదాకా తన రియలిస్టిక్ పర్ఫామెన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా తన కొత్త సినిమా కోసం ఆయన పడిన కష్టం చూసి అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ధనుష్ తన తాజా చిత్రం కుబేర కోసం ఏకంగా 10 గంటల పాటు భరించలేని కంపులో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నాడట.

డంపింగ్ యార్డులో 10 గంటలు..

ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు తమిళంలో సినిమాలు చేస్తూనే మరోవైపు తెలుగులో కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటున్నాడు. చివరగా సర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ధనుష్ ఇప్పుడు తెలుగులో కుబేర అనే మూవీ చేస్తున్న విషయం తెలిసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తుండగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలోని డంపింగ్ యార్డ్ లో జరుగుతోంది.

కుబేర మూవీలోని కీలకమైన సన్నివేశం సహజంగా వచ్చేందుకుగాను ధనుష్ మాస్క్, గ్లౌజులు లాంటివి లేకుండానే ఆ భరించలేని కంపులో ఏకంగా 10 గంటల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడని వార్త సంచలనంగా మారింది. చిత్ర యూనిట్ అంతా మాస్కులు, గ్లౌజులు వంటి జాగ్రత్తలు తీసుకొని సెట్స్ లో ఉంటే, తన క్యారెక్టర్ బాగా వచ్చేందుకు ధనుష్ మాత్రం కనీసం ఆ కంపును భరించడానికి మాస్కు కూడా ధరించకుండా గంటల తరబడి షూటింగ్లో పాల్గొన్నాడు అనే విషయం తెలిసిన అభిమానులు సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ కు హ్యాట్సాప్ చెప్తున్నారు. ఇక మరోవైపు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఇదే సాహసం చేశాడని తెలుస్తోంది. మొత్తానికి వీరిద్దరి నిబద్ధత, కృషి కారణంగా డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసిన సన్నివేశం అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. దీని గురించి తెలుసుకున్న నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా హీరో, డైరెక్టర్ పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. మరి సినిమా కోసం ఇంతగా కష్టపడ్డ హీరో, డైరెక్టర్ కు ఎలాంటి ఫలితం రాబోతోంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

- Advertisement -

రియలిస్టిక్ కు కేరాఫ్ అడ్రస్

ధనుష్ తన రియలిస్టిక్ పర్ఫామెన్స్ తో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆయన ప్యాషనేట్ యాక్టర్ అన్న విషయం మూవీ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే మరోవైపు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఇదే విధంగా సహజంగా తన సినిమాలు ఉండేలా చూసుకుంటారు. రియలిస్టిక్ ఫిలిం మేకింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర మూవీ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆయన తన సినిమాలోని పాత్రలకు ఏ విధంగా ప్రాణం పోస్తారో అందరికీ తెలిసిందే. ఇక ధనుష్ కూడా సహజ నటనతో సినిమాకు తగ్గ లుక్స్, బాడీ లాంగ్వేజ్ మైంటైన్ చేస్తూ పర్ఫెక్ట్ అనిపించేలా నటిస్తారు. ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఇప్పటికే ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో ధనుష్ డి గ్లామర్ రోల్ లో బిచ్చగాడిలా కనిపించబోతున్నాడు. కాగా కుబేర మూవీ షూటింగ్ చాలా వరకు ముంబైలోనే జరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు