Samyuktha Menon: ఆ హీరో కోసం రూ.5 కోట్ల ఆఫర్.. సంయుక్త కామెంట్స్ వైరల్.!

Samyuktha Menon.. అబ్బాయిల కలల రాకుమారిగా మంచి పేరు సంపాదించింది హీరోయిన్ సంయుక్త మీనన్.. ముఖ్యంగా ఈమె అందానికి, ఫిజిక్ కు కుర్రకారు సైతం మంత్రముగ్దులవుతున్నారు.. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ నటించింది కేవలం నాలుగు సినిమాలలో అయినా కూడా తనకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పరచుకుంది. లక్కీ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది సంయుక్త మీనన్.. కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అలా సరైన సినిమా కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటోంది.

Samyuktha Menon: Rs. 5 crore offer for that hero.. Samyuktha's comments are viral.!
Samyuktha Menon: Rs. 5 crore offer for that hero.. Samyuktha’s comments are viral.!

విజయ్ మూవీ ఐటెం సాంగ్ కోసం రూ.5కోట్లు ఆఫర్..

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ. గత రెండు రోజుల నుంచి సంయుక్త మేనన్ కి తమిళ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో విజయ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటింపచేయాలని అనుకుంటున్నారట. అయితే ఇందుకోసం దర్శక నిర్మాతలు కూడా విశ్వ ప్రయత్నం చేయడంతో పాటు ఏకంగా ఈమె స్పెషల్ సాంగ్ కోసం రూ .5కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ ఆఫర్ ను సున్నితంగానే తిరస్కరించినట్లు సమాచారం.

కోట్లు ఇచ్చినా నో అంటున్న సంయుక్త..

ముఖ్యంగా సంయుక్త మేనన్ ఏదైనా సినిమా స్టోరీ విన్న తర్వాత ఒప్పుకోవాలంటే కచ్చితంగా కాస్త ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటుంది.. అలాంటిది మరి ఐటెం సాంగ్ కి ఒప్పుకుంటుందా అంటే అభిమానులు కూడా ఒప్పుకోదనే తెలుపుతున్నారు. నిజానికి ఎంతటి స్టార్డం ఉన్న హీరోయిన్ కైనా సరే ఐటెం సాంగ్ కి కేవలం రూ.1కోటి నుంచి రూ .2కోట్లు మాత్రమే ఇస్తూ ఉంటారు కానీ ఏకంగా సంయుక్త కోసం రూ .5కోట్లు ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు. అయితే హీరోయిన్ గా ఒక చిత్రానికి ఈ ముద్దుగుమ్మ రూ .3కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -

సంయుక్త కెరియర్..

సంయుక్త మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఐటెం సాంగ్ గా అయితే చేయనని తెగేసి చెప్పేస్తోంది. ముఖ్యంగా ఇలాంటి స్టార్ హీరోతో సినిమాలు అంటే కచ్చితంగా చాలామంది సెలబ్రిటీలు ఒప్పుకుంటూ ఉంటారు.. కానీ సంయుక్త మేనన్ విషయంలో మాత్రం అలా చేయకపోవడంతో అభిమానులు ఈమెను మెచ్చుకుంటున్నారు. సంయుక్త కెరియర్ లో తెలుగులో భీమ్లా నాయక్, సార్, విరూపాక్ష వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో చివరిగా కళ్యాణ్ రామ్ తో కలిసి డెవిల్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది ఈ ముద్దుగుమ్మకు.. మరి తన తదుపరి చిత్రం ఏంటన్నది సంయుక్త ప్రకటిస్తుందేమో చూడాలి. మొత్తానికైతే విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశాన్ని కోల్పోయింది ఈ ముద్దుగుమ్మ.. మరి ఎలాంటి ప్రాజెక్టుతో మళ్ళీ మన ముందుకు వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు