Chiranjeevi: భర్తను అవమానించిన సురేఖ.. పుట్టింటికి వెళ్ళిపోతానంటూ..!

Chiranjeevi… టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో నేడు మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.. సినిమా పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా నలుగురికి సహాయపడుతూ మంచి మనసున్న వ్యక్తిగా పేరు దక్కించుకున్నారు.. అంతేకాదు సొంతంగా పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసి కొద్ది రోజులు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇంకా హీరోగా ఎదగక ముందే హాస్యబ్రహ్మ అల్లు రామలింగయ్య కూతురు అల్లు సురేఖను వివాహం చేసుకున్నారు.. ఇక తర్వాతే ఆయనకు కలిసొచ్చిందని చెబుతూ ఉంటారు సినీ విశ్లేషకులు.

Chiranjeevi: Surekha insulted her husband..she Said going to my mom's house.!
Chiranjeevi: Surekha insulted her husband..she Said going to my mom’s house.!

రాధా , రాధికలతో చిరంజీవి ఎఫైర్..

ఇప్పటికీ చిరంజీవి ,సురేఖ దంపతులు ఎంతోమందికి ఆదర్శం కూడా.. అయితే వీరిద్దరి మధ్య కూడా గొడవ జరిగిందని.. ఆ బాధ తట్టుకోలేక ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించిందంటూ గతంలో వార్తలు వినిపించాయి.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా ఒక హీరో తో ఒక హీరోయిన్ రెండు మూడు సినిమాలు చేసిందంటే కచ్చితంగా వారిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ సృష్టిస్తారు ప్రేక్షకులు.. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చిరంజీవితో నటించాలని చాలామంది అనుకుంటారు.. అందులో భాగంగానే రాధా, జయసుధ, రాధిక లాంటి హీరోయిన్లు చిరంజీవితో చాలా సినిమాలలో జతకట్టారు. ముఖ్యంగా రాధా , చిరంజీవి మధ్య కెమిస్ట్రీ ఎంతలా ఉండేదంటే ఆన్ స్క్రీన్ అద్భుతంగా అనిపించేది.. అలా వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలే వచ్చాయి.. ఈ క్రమంలోనే వీరి ఇద్దరి మధ్య ఎఫైర్ రూమర్స్ కూడా అంతే వేగంగా స్ప్రెడ్ అయ్యాయి..

పుట్టింటికి వెళ్ళిపోతానన్న సురేఖ..

ఇక అలా రాధా, రాధిక లతో చిరంజీవి ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరిలో ఒకరిని వివాహం చేసుకోబోతున్నారని పలు రకాల రూమర్స్ సృష్టించారు. అంతేకాదు చిరంజీవి రాధా, రాధికా వంటి హీరోయిన్స్ తో ఎఫైర్ పెట్టుకున్నారని.. పలు పత్రికలు కూడా బహిరంగంగానే రాసుకు వచ్చాయి.దీంతో ఈ వార్త చూసిన సురేఖ చాలా బాధపడిందట. తన భర్త తనకు అన్యాయం చేస్తున్నాడని.. గొడవ పెట్టుకుందట. షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన చిరంజీవిని బాగా తిట్టి అవమానించిందట. అంతేకాదు చిరంజీవి తల్లి అంజన దేవి ఎంత చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఇలాంటి వార్త ఇంకోసారి వస్తే తాను తన పుట్టింటికి వెళ్ళిపోతానని కూడా బెదిరించిందట .. కొన్ని రోజుల తర్వాత అది రూమర్ అని తెలుసుకున్న సురేఖ చాలా బాధపడిపోయిందని తన భర్తను అనవసరంగా బాధపెట్టానని కన్నీరు పెట్టుకుందట… ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు కూడా చిరంజీవిని సురేఖ గారు ఇంతలా అనుమానించారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ సహజం అని అందరికీ తెలిసిందే . ఆ తర్వాత తాను కూడా సినీ ఇండస్ట్రీలో వచ్చే రూమర్స్ కి అలవాటు పడిపోయి. వాటన్నింటిని పట్టించుకోవడమే మానేసిందట సురేఖ కొణిదెల.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు