Jaragandi Song : బర్త్ డే స్పెషల్ సాంగ్ ఈ రికార్డుని బ్రేక్ చేస్తుందా?

Jaragandi Song : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ జేమ్స్ కామెరూన్ అని పిలుచుకునే శంకర్ షణ్ముగం ల క్రేజీ కాంబినేషన్ లో ఎప్పటి నుండో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాపై మెగాఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా అభిమానుల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి. మూడేళ్ళుగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ అప్పుడూ, ఇప్పుడూ అంటూ ఫ్యాన్స్ అనుకోవడం తప్ప మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి అప్డేట్ రావడం లేదు. ఇక దిల్ రాజు అయితే సినిమాకి ఖర్చు పెట్టడం తప్ప రిలీజ్ డేట్ శంకర్ చేతుల్లోనే ఉందని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు. ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే రిలీజ్ కావాల్సి ఉండగా శంకర్ మరో ప్రాజెక్ట్ ఇండియన్ 2 ముందు రిలీజ్ కి రెడీ అయింది. అయితే ఈ సినిమా జులై లోపే గనుక రిలీజ్ అయిపోతే ఈ ఇయర్ ఎండ్ టైంకి గేమ్ ఛేంజర్ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉండగా, సినిమా నుండి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఫస్ట్ సాంగ్ అయిన
‘జరగండి జరగండి’ సాంగ్ ను రిలీజ్ చేయాల్సి ఉంది.

అయితే రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేయగా, అనుకోకుండా సాంగ్ లీక్ అవ్వగా తర్వాత సాంగ్ రిలీజ్ ను నిరవధికంగా పోస్ట్ పోన్ చేశారు. సాంగ్ కి వచ్చిన ట్రోలింగ్ కి మేకర్స్ అలోచించి, సింగర్ ని కూడా మార్చేశారు. చాలా రోజుల పాటు సాంగ్ పై ఎలాంటి అప్ డేట్ కూడా ఇవ్వలేదు టీం. ఆ మధ్య సంక్రాంతికి రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చినా కుదరలేదు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

దాంతో ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత 24 గంటల్లో యూట్యూబ్ లో రికార్డులతో దుమ్ము లేపాలని ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టాలీవుడ్ లో రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ లో ,లిరికల్ వీడియోల పరంగా హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని అందుకున్న సాంగ్స్ ను గమనిస్తే 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను అందుకున్న సాంగ్ రికార్డ్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ లోని ‘దమ్ మసాలా సాంగ్’ పేరిట ఉంది. ఆ సాంగ్ 24 గంటలలో 17.42 మిలియన్ వ్యూస్ ని అందుకుంది.

- Advertisement -

ఇక అదే విధంగా 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ రికార్డ్ కూడా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని ‘కళావతి’ సాంగ్ 806.3K లైక్స్ తో టాప్ లో ఉంది. ఇక గేమ్ చేంజర్ సినిమా నుండి వస్తున్న ‘జరగండి జరగండి’ సాంగ్ 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. నిజానికి ఈ సాంగ్ లీక్ అయినప్పటికీ భారీ అంచనాలున్నాయి. లీక్ అయిన తర్వాత మేకర్స్ ట్యూన్స్ ఛేంజ్ చేసి డాలర్ మెహేంది తో ఈ సాంగ్ ని మళ్ళీ పాడించడం జరిగింది. ఇక ఈరోజు ఉదయం 9 గంటలకు రిలీజ్ అవబోతున్న సాంగ్ ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు