Anupama Parameshwaran : ట్రైలర్ కి పది రెట్లట

Anupama Parameshwaran : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమా టిల్లు స్క్వేర్. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిందన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ లేనిది గ్లామర్ టచ్ ఎక్కువగా ఉన్న పాత్రను టిల్లు స్క్వేర్ లో చేసిన అనుపమ పరమేశ్వరన్ హీరో సిద్దు జొన్నలగడ్డతో కిస్సులకు సైతం నో చెప్పకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అంతకు ముందు రౌడీ బాయ్స్ సినిమాలో పలు కిస్సింగ్ సీన్స్ ఉన్న అంతకు మించి శృతి మించలేదు.

కానీ ఈ సినిమాలో అనుపమ ఈ బోల్డ్ నెస్ గురించి పలు ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలలో ఎదురైన ప్రశ్నలకు కేరళ కుట్టి చాలా తెలివిగానే సమాధానం ఇచ్చింది. ఎప్పుడూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసి బోర్ కొట్టిందని, అందుకే డిఫరెంట్ గా కమర్షియల్ మీటర్ లో నటనకు అవకాశమిచ్చిన లిల్లి పాత్రను ఒప్పుకున్నానని క్లారిటీ ఇచ్చింది. ఇక ట్రైలర్ లో చూపించింది శాంపిల్స్ కాబట్టి అసలు కంటెంట్ వేరే లెవెల్ ఉండొచ్చని అంది.

నిజానికి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లకు కట్టుబడుతూ వచ్చిన అనుపమ తీసుకున్న నిర్ణయం రైటో కాదో ఈ శుక్రవారం తేలిపోతుంది. టిల్లు స్క్వేర్ మీద ప్రత్యేక ఆసక్తి పెరగడానికి అనుపమ కూడా ఒక కారణం కావడంతో ఫలితం పట్ల ఎగ్జైటింగ్ గా ఉండటం సహజం. అయితే అసలే బాక్సాఫీస్ బాగా డౌన్ లో ఉన్న టైంలో సినిమా వస్తోంది. పాజిటివ్ టాక్ రావడమే ఆలస్యం వసూళ్లు మోతెక్కిపోతాయని టీమ్ నమ్మకంగా ఉంది. అనుపమకు లాస్ట్ రిలీజ్ ఈగల్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. యాక్షన్ విజువల్స్ బాగున్నా ఎమోషన్ పండకపోవడంతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఇక జయం రవితో తమిళంలో చేసిన సైరెన్ కూడా ఫ్లాప్ మూటగట్టుకుంది. అందువల్ల టిల్లు స్క్వేర్ హిట్ కావడం అనుపమకు చాలా కీలకం.

- Advertisement -

ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఆక్టోపస్ లో కీలక పాత్ర చేసింది కానీ ఇంకా దాని తాలూకు డీటెయిల్స్ బయటికి రాలేదు. ఇక టిల్లు స్క్వేర్ కనక బ్లాక్ బస్టర్ అయితే స్టార్ హీరోల సరసన గ్లామర్ అవకాశాలు వచ్చే ఛాన్స్ బాగా ఉంది. కానీ నటనలో ఎనిమిదేళ్ల సీనియారిటీ ఉన్న అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameshwaran ) కు నెక్స్ట్ కథలను ఎంచుకోవడం కూడా సవాల్ గానే ఉంటుంది. సిద్దుకి చుక్కలు చూపించే లిల్లీగా అనుపమకు టిల్లు స్క్వేర్ లో చాలా షేడ్స్ ఉంటాయట. ఇక ట్రైలర్ లో చూపించిన రొమాంటిక్ డోస్ కి పది రెట్లు సినిమాలో సీన్లు ఉన్నాయట. మరి అనుపమ ఈ సినిమాకి హద్దుమీరి చేసిన రొమాన్స్ తన కెరీర్ కి యూజ్ అవుతుందా? లేక మొదటికే మోసం వచ్చి మంచి పెర్ఫార్మన్స్ రోల్స్ చేసే అమ్మాయి అన్న పేరు పోతుందా అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు