Tillu Square : “టిల్లు స్క్వేర్” బిగ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్… రిస్క్ చేస్తున్నారా?

“డీజే టిల్లు” తర్వాత సిద్దు జొన్నలగడ్డ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ మూవీ ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు సీక్వెల్ “టిల్లు స్క్వేర్” అంటూ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ క్రియేట్ చేసిన పాజిటివ్ వైబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ముఖ్యంగా సిద్దు, అనుపమ రొమాన్స్ కోసమే యూత్ అంతా ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా “టిల్లు స్క్వేర్” మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. దాని ప్రకారం చూసుకుంటే సిద్దుకు ఇదే తన కెరీర్ లో బిగ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అని చెప్పొచ్చు. మరి డిస్ట్రిబ్యూటర్లు “టిల్లు స్క్వేర్”ను నమ్మి రిస్క్ చేస్తున్నారా? సిద్దు ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చేరుకోగలడా? అంటే…

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే…

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీకి కథనం, డైలాగ్స్ సిద్దు జొన్నలగడ్డ అందించగా, మల్లి రామ్ దశరథ వహించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇక టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే… ఆంధ్రాలో 12 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లకు టిల్లు స్క్వేర్ మూవీ రైట్స్ అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ఇక నైజాంలో ఈ మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ 10 కోట్లు కోట్ చేశారని సమాచారం. మొత్తంగా టిల్లు స్క్వేర్ మూవీ థియేట్రికల్ బిజినెస్ 30 నుంచి 35 కోట్ల మధ్యన జరిగిందని సమాచారం. నిజానికి సిద్దు జొన్నలగడ్డ మార్కెట్ ను చూసుకుంటే ఇది భారీ మొత్తమే అని చెప్పొచ్చు. కానీ టిల్లు కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్లు సిద్ధూ జొన్నలగడ్డపై ఇలా రిస్క్ చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. జనవరి తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆ స్టామినా టిల్లు స్క్వేర్ కే ఉందని గట్టిగా నమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అందుకే నిర్మాతలు కూడా మెయిన్ స్క్రీన్ లకు నాలుగు వారాల అగ్రిమెంట్ చేసుకోమని చెప్పినట్టు ఇన్సైడ్ టాక్. పాజిటివ్ టాక్ వస్తే ఈ మూవీని ఆ నెక్స్ట్ వీకే రాబోతున్న ఫ్యామిలీ స్టార్ కూడా ఆపలేడు. కానీ ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా నష్టాలు తప్పవు. మరి టిల్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవుతాడా? అంటే మార్చ్ 29 వరకు వెయిట్ అండ్ సీ.

- Advertisement -

డిజిటల్ రైట్స్ కు కూడా ఇదే డిమాండ్..

ఇక ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ రెండు గంటల లోపే ఉంటుందని తెలుస్తోంది. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ మూవీ నిజానికి ఫిబ్రవరి 9న రిలీజ్ కావలసి ఉంది. కానీ సంక్రాంతి సినిమాలకు జరిగిన ఒప్పందం కారణంగా ఆ డేట్ ను రవితేజ ఈగల్ కోసం టిల్లు స్క్వేర్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ కు కూడా ఇదే రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా టిల్లు స్క్వేర్ ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దాదాపు 35 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా టాక్ నడుస్తోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు