The Goat Life : టిల్లుతో ప్రభాస్ ఫ్రెండ్ పోటీ… ఈ రెండు ఇబ్బందులు ఫేస్ చెయ్యాల్సిందే

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రను పోషిస్తున్న మూవీ “ఆడుజీవితం – ది గోట్ లైఫ్”. డైరెక్టర్ బ్లేసీ దాదాపుగా పదేళ్లు కష్టపడి తీసిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీని మార్చి 28న పాన్ ఇండియా మూవీగా అన్నీ భారతీయ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే తెలుగులో మాత్రం ఈ మూవీ రిలీజ్ పరంగా రెండు మేజర్ ఇబ్బందులను ఫేస్ చెయ్యక తప్పదు. మరి ఇంతకీ “ది గోట్ లైఫ్” మూవీకి టాలీవుడ్ లో ఎదురు కాబోతున్న కష్టాలేంటి? అంటే…

“ది గోట్ లైఫ్” వర్సెస్ “టిల్లు స్క్వేర్”

అడ్వెంచరస్ సర్వైవల్ థ్రిల్లర్ “ఆడుజీవితం : ది గోట్ లైఫ్” ట్రైలర్ రీసెంట్ గా రిలీజై, సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఇప్పటికే “సలార్” మూవీలో ప్రభాస్ ఫ్రెండ్ గా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కు టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది. ముఖ్యంగా వరదరాజ మన్నార్ గా పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలోనే మార్చ్ 28న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత రోజే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న “టిల్లు స్క్వేర్” థియేటర్లలోకి దిగబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ, టిల్లు క్రేజ్ ముందు ఈ మలయాళ సినిమా థియేటర్లలో నిలదొక్కుకుంటుందా అంటే అనుమానమే. అయితే ఆ అనుమానాలన్నింటినీ తీర్చడానికే ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు. అందులో భాగంగానే హైదరాబాద్ కు వచ్చి మరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రభాస్ కు తనతో ఉన్న రిలేషన్ గురించి, సలార్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టిల్లు స్క్వేర్ లాంటి మూవీకి పోటీగా రిలీజ్ అవుతున్నప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ వారు “ది గోట్ లైఫ్” హిట్ అవుతుందని స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. మరి వీరి నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే మార్చ్ 22 దాకా ఆగాల్సిందే.

- Advertisement -

మరో డేంజర్… ఈసారి హాలీవుడ్

ఈ మూవీకి ఇప్పటిదాకా టాలీవుడ్ నుంచి పొంచి ఉన్న ముప్పు గురించే మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ హాలీవుడ్ నుంచి మరో డేంజర్ ఉంది. హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే ఇండియన్ మూవీ లవర్స్ “గాడ్జిల్లా x కాంగ్” మూవీ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ కూడా మార్చ్ 29నే థియేటర్లలోకి రాబోతోంది. భారతదేశంలో ఇలాంటి హాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ మూవీపై “గాడ్జిల్లా x కాంగ్” వల్ల కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ పడక తప్పదు. మరి ఈ రెండు ఇబ్బందులను దాటుకొని పృథ్వీరాజ్ మూవీ హిట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా “ఆడు జీవితం” మూవీని రచయిత బెన్యామిన్ రాసిన బుక్ ఆధారంగా అదే పేరుతో డైరెక్టర్ బ్లేసీ తెరకెక్కించారు. ఈ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లి, బానిసగా, గొర్రెల కాపరిగా మారిన ఓ వ్యక్తి జీవిత కథ ఈ మూవీ. ఆ ఎడారి నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేదే తెరపై చూడాల్సిన స్టోరీ. సినిమాలో పృథ్వీరాజ్, అమలాపాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా జిమ్మీ, రిక్ అబీ కీలక పాత్రలు పోషించారు. బ్లేసీ, జిమ్మీ జిన్ లూయిస్, స్టీఫెన్ ఆడమ్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు