Sai Pallavi : డైరెక్టర్‌గా లేడీ పవర్ స్టార్… స్టోరీ కూడా రెడీ..?

ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి క్రేజ్‌తో అందరికీ తెలిసిందే. హీరోయిన్లల్లో అంతటి ఫాలోయింగ్ సాయి పల్లవికి ఉంది. అందుకే ఆమెను లేడీ వపర్ స్టార్ అని పిలుస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరికి ఓ డ్రీమ్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ వాళ్లకు కూడా డ్రీమ్స్ ఉంటాయి. అలా లేడీ పవర్ స్టార్‌గా ఎదిగిన సాయి పల్లవికి కూడా ఓ డ్రీమ్ ఉందట. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…

గ్యాప్ తర్వాత బ్యాక్ టూ బ్యాక్…

ఈ లేడీ పవర్ స్టార్ గార్గి సినిమా తర్వాత దాదాపు 20 నెలల వరకు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. సాయి పల్లవి సిస్టర్ కోసం కోయంబత్తూర్‌లో సాయి పల్లవి ఓ హస్పిటల్ నిర్మించింది. నిర్మాణ పనులు అయ్యే వరకు సాయి పల్లవి కెమెరా ముందుకు రాలేదు. హస్పిటల్ పనులన్నీ పూర్తి అయ్యాక, బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తుంది. ఇప్పటికే తమిళంలో శివ కార్తికేయన్‌తో అమరన్ మూవీ చేస్తుంది. ఇక తెలుగులో నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న తండేల్ మూవీలో సత్య అనే పాత్రలో కనిపించబోతుంది. అంతే కాకుండా బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేసింది. అలాగే బాలీవుడ్ రామయణ్ లో సీత పాత్ర కోసం ఆఫర్ వచ్చిందట. కానీ, ఆ ఆఫర్ ను సాయి పల్లవి రిజెక్ట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

సాయి పల్లవి డ్రీమ్ ఇదే…

ప్రస్తుతానికి ఇలా సాయి పల్లవి చేతి నిండా సినిమాలు ఉన్నాయి. కానీ ఇదేమీ కూడా ఆమెకు సంతోషాన్ని ఇవ్వడం లేదట. డాక్టర్ అవ్వాల్సింది… డ్యాన్సర్ అవ్వాల్సింది… కానీ, చివరికి హీరోయిన్ అయిపోయాను… డాక్టర్, డ్యాన్సర్ అవ్వకున్నా… తనకు మరో డ్రీమ్ ఉందట. అదే డైరెక్షన్. ఎలాగైన డైరెక్టర్ అయి మెగా ఫోన్ పట్టుకోవాలి అనేది సాయి పల్లవి డ్రీమ్ అంట. అందుకోసం ఇప్పటి నుంచే వర్క్ కూడా స్టార్ట్ చేస్తుందట. తనకు సరిగ్గా సెట్ అయ్యే కథ కోసం సెర్చ్ చేస్తుందట సాయి పల్లవి. కథ సెట్ అయిన వెంటనే కెమెరా ముందు నుంచి వచ్చి వెనక ఉండి మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అయిపోతుందట.

తండేల్ అప్డేట్…

తండేల్ మూవీలో సత్య అనే పాత్రలో సాయి పల్లవి కనిపించబోతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ చందు మొండేటి శర వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఇటీవల షూటింగ్ స్పాట్ నుంచి సాయి పల్లవి ఫోటోలు కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ప్రొడ్యూసర్లు గీతా ఆర్ట్స్ కూడా తండేల్ షూటింగ్ స్పాట్ లో వర్కింగ్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో వదిలారు. ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో సాయి పల్లవి స్మైల్ చాలా క్యూట్ అంటూ అభిమానుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

కాగా, తండేల్ షూటింగ్ వేగంగా జరుగుతుందని, త్వరలోనే షూటింగ్ పార్ట్ పూర్తి చేసి ఓ అప్డేట్ కూడా ఇస్తామని గీతా ఆర్ట్స్ అనౌన్స్ చేసింది. అయితే తండేల్ మూవీ అటు నాగ చైతన్య ఇటు సాయి పల్లవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని క్రిటిక్స్ అంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా కాబట్టి వాళ్ల కెరీరలో నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు