Game Changer : రిలీజ్ కి ముందే లాభాలు… చెర్రీ మూవీనా మజాకా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత చెర్రీ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడంతో ‘గేమ్ ఛేంజర్’పై హైప్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఉంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా బిజినెస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘గేమ్ ఛేంజర్’ మూవీ డిజిటల్ రైట్స్ దిమ్మతిరిగే ధరకు అమ్ముడు కాగా, రిలీజ్ కి ముందే నిర్మాతలకు లాభాల పంట పండిందని తెలుస్తోంది. మరి ఇంతకీ ‘గేమ్ ఛేంజర్’ స్ట్రీమింగ్ రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయి? నిర్మాతలకు ఎన్ని కోట్లు లాభం? అనే వివరాల్లోకి వెళ్తే….

‘గేమ్ ఛేంజర్’కు మాసివ్ డీల్

‘గేమ్ ఛేంజర్’ మూవీ ఓటిటి రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మార్చ్ 19న ముంబైలో జరిగిన ప్రైమ్ వీడియో స్పెషల్ ఈవెంట్ ద్వారా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. థియేట్రికల్ రన్ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఒరిజినల్ తమిళ వెర్షన్ ను ప్రసారం చేయడానికి అమెజాన్ 150 కోట్లు చెల్లించినట్టు నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మూవీ మిగతా భాషల డిజిటల్ రైట్స్ ను మాత్రం జీ5 అనే మరో ఓటిటీ సంస్థ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అమెజాన్ కంటే జీ5 మూడింతలు ఎక్కువ ధరకు ‘గేమ్ ఛేంజర్’ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. దీనికోసం జీ5 270 కోట్లు చెల్లించిందని ట్రేడ్ అనలిస్టులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఒకవేళ ఇదే నిజమైతే ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీజర్ రిలీజ్ కాకుండానే, కనీసం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయకుండానే రైట్స్ ద్వారా 420 కోట్లు సంపాదించినట్టు. ఈ మూవీ దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నట్టుగా టాక్ నడుస్తోంది. రిలీజ్ కంటే ముందే పెట్టిన బడ్జెట్ పైన 20 కోట్లు ఎక్కువగా రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది ఈ మూవీ. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు మరి చెర్రీ మూవీనా మజాకా అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఈ సినిమాలోని 7 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కోసం శంకర్ ఏకంగా 70 కోట్లు ఖర్చు చేశాడని, మరో పాట కోసం 23 కోట్లు ఖర్చు అయ్యిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

చెర్రీ బర్త్ డేకి ట్రిపుల్ ట్రీట్

ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గా విశాఖపట్నంలో ఈ మూవీ షూటింగ్ జరిగింది. రెండేళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా పలు కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాదులో జరగనుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ మూవీ నుంచి “జరగండి” రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చెర్రీ, బుచ్చిబాబు సినిమా టైటిల్ కూడా అదే రోజున బయటకు రాబోతోంది. మార్చ్ 27న రామ్ చరణ్, సుకుమార్ మూవీ అప్డేట్ కూడా రాబోతోంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు