Ram Charan Birthday : చెర్రీ బర్త్ డేకు వరుస అప్డేట్స్… మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందడి ఇప్పటి నుంచి మొదలైపోయింది. ఈ సారి చెర్రీ పుట్టినరోజుకు ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తేలా ఏకంగా మూడు బిగ్ అప్డేట్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ అప్డేట్స్ ఏంటి? అంటే…

“గేమ్ ఛేంజర్”కే ఇంపార్టెన్స్ అంతా…
ముందుగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ తాజా చిత్రం “గేమ్ ఛేంజర్” గురించే. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఏళ్ల తరబడి జరుగుతోంది. కొన్ని రోజులు ఈ మూవీ షూటింగ్ కు శంకర్ కారణంగా బ్రేక్ పడగా, ఇప్పుడు మళ్లీ మొదలైంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి చెర్రీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నప్పటికీ కనీసం సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వట్లేదని మెగా ఫాన్స్ తెగ మండిపడుతున్నారు. ఒకానొక సమయంలో సహనం నశించి శంకర్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇవ్వట్లేదు అన్న అక్కసుతో స్టార్ డైరెక్టర్ అని కూడా చూడకుండా బండ బూతులు తిట్టేశారు.

వాళ్లను శాంత పరచడానికే అన్నట్టుగా చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 27న “గేమ్ ఛేంజర్” మూవీ నుంచి అప్డేట్ రాబోతుందని ప్రచారం జరుగుతుంది. మార్చ్ 27న చాలాకాలంగా మెగా ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ‘జరగండి జరగండి” అనే పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ ను తమన్ కంపోజ్ చేయగా, హీరో హీరోయిన్లు రామ్ చరణ్, కియారా అద్వానీలపై షూట్ చేశారు. ఇక పాటతో పాటు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న “గేమ్ ఛేంజర్” మూవీ రిలీజ్ డేట్ పై కూడా అదే రోజున క్లారిటీ వస్తుందని ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.

- Advertisement -

రెండవ ట్రీట్ @RC16
చెర్రీ 39వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సన్నాహాలు మొదలు పెట్టారు అభిమానులు. ముఖ్యంగా ఆయన సినిమాల నుంచి ఇవ్వబోతున్న అప్డేట్స్ గురించి ఫుల్ క్యూరియాసిటీ నెలకొంది. ఒకటవ అప్డేట్ “గేమ్ ఛేంజర్” మూవీ సాంగ్ కాగా, రెండవ అప్డేట్ ఆయన నెక్స్ట్ మూవీ నుంచి ఉండబోతోంది. రామ్ చరణ్ తన 16వ సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు, టైటిల్ ను కూడా మార్చి 27న ప్రకటిస్తారని సమాచారం. ఇక ఇప్పటికే ఈ మూవీకి “పెద్ది” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

బొనాంజా డబుల్ కాదు ట్రిపుల్…
ఇక ముచ్చటగా మూడవ అప్డేట్ విషయానికి వస్తే… చెర్రీ 17వ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా బయటకు వస్తుందని టాక్ నడుస్తోంది. “గేమ్ ఛేంజర్” మూవీ పూర్తయ్యాక బుచ్చిబాబుతో చెర్రీ నెక్స్ట్ మూవీని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత లెక్కల మాస్టర్ సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో మరో బిగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చెర్రీ పుట్టిన రోజున మూడవ ట్రీట్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి చాలా రోజులుగా చరణ్ మూవీ నుంచి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ ఆకలి మార్చి 27న తీరబోతుంది అన్నమాట.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు