Renu Desai: ఆద్య గురించి ఆ విషయం చెప్పిన రేణూ..పోస్ట్ వైరల్..!

ప్రముఖ హీరోయిన్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ రెండో భార్య రేణూ దేశాయ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగానే ఉందని చెప్పాలి. అయితే ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే ప్రతి విషయంపై కూడా స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసే రేణూ దేశాయ్ తాజాగా తన కూతురు ఆద్య గురించి ఒక విషయాన్ని చెప్పి అందరికీ ఆనందాన్ని కలిగించింది..

ఆద్య ఫోటోతో పోస్ట్..
తాజాగా ఆద్య ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈమెకు సంబంధించిన ఒక విషయాన్ని రేణూ దేశాయ్ వెల్లడించారు. ఆద్య ఎన్నో రోజులకి ముక్కుపుడక పెట్టుకుంది అనే విషయాన్ని ఈమె పోస్టు ద్వారా తెలియజేయడం గమనార్హం. ఎప్పటినుంచో ముక్కు పుడక పెట్టించాలనే ప్రయత్నం చేస్తున్నాను.. కానీ సరైన సమయం కుదరడం లేదు.. ఎట్టకేలకు ఆద్య కిన్ముక్కుపుడక పెట్టించాను అంటూ తెలియజేసింది.. అంతేకాదు ఆద్య అద్దంలో ముక్కు పుడక పెట్టుకున్న తనను తాను చూసుకుంటూ మురిసిపోతున్న ఫోటోని క్యాప్చర్ చేసి ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది రేణు దేశాయ్.. అంతేకాదు అమ్మాయిలు చెవులు, ముక్కు కుట్టించుకుంటూ ఉంటారు …ఇలా ఆభరణాలు పెట్టుకోవడమే అమ్మాయిలకు అతిపెద్ద అలంకరణ అంటూ రేణు దేశాయ్ ఆద్య ఫోటోని షేర్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.. ముక్కుపుడకలో ఆద్య చాలా క్యూట్ గా కనిపిస్తూ ఉండడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

- Advertisement -

రేణు దేశాయ్..
జానీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణు దేశాయ్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.. అప్పటికే వివాహమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేసి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న ఈమె.. పెళ్లైన కొద్ది కాలానికే అంటే కూతురు ఆద్య జన్మించిన తర్వాత విడాకులు తీసుకున్నారు . ఇక భర్తకి దూరంగా ఉంటూ పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ముంబైలోనే సెటిల్ అయిపోయింది రేణు దేశాయ్.. కరోనా సమయంలో ఎంతోమందికి అండగా నిలిచిన ఈమె వారికి కావలసిన సహాయాన్ని కూడా అందిస్తూ వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటోంది.

పవన్ కళ్యాణ్..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు.. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కాస్త సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాల పైన ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.. ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. నందిని రెడ్డిని వివాహం చేసుకొని విడిపోయిన తర్వాత నటి రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత ఆమెతో వచ్చిన మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.. తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తాను స్థాపించిన జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు