Pawan kalyan : ‘భీమ్లా నాయక్’ మాస్ అవతార్ కి రెండేళ్లు..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “భీమ్లా నాయక్” సినిమా గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా రోజులుగా పవన్ నుండి ఒక సరైన మాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ కి మాంచి కిక్కిచ్చింది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాయడం జరిగింది. ఇక ఇదే సినిమాలో లాలా.. భీమ్లా అంటూ త్రివిక్రమ్ రాసిన పాట గుర్తుండే ఉంటుంది. ఆ పాట అప్పట్లో యూట్యూబ్ లో ఎంత దుమ్ము లేపిందో తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మించిన భీమ్లా నాయక్ రిలీజ్ అయి నేటికీ (2022 ఫిబ్రవరి 25) సరిగ్గా రెండేళ్లు..

ఈ సందర్బంగా అప్పట్లో మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ ని ఒకసారి గుర్తు చేసుకుందాం. పవన్ కళ్యాణ్ హీరోగా అప్పటికే వకీల్ సాబ్ తో కం బ్యాక్ ఇచ్చినా ఫ్యాన్స్ లో ఏదో తెలీని వెలితి. ఒక మాస్ మూవీ రాలేదని.. ఆ లోటుని తీర్చడానికే అప్పుడు ఈ సినిమా వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే రీమేక్ మూవీ అయినా కూడా త్రివిక్రమ్ హ్యాండ్ ఉండడం వల్ల ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. పైగా అప్పటికే రిలీజ్ అయిన టీజర్ గాని, ట్రైలర్ గాని థమన్ బీజీఎమ్ తో అదిరిపోయాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో సెకండ్ లీడ్ గా నటించిన రానా దగ్గుపాటి పవన్ తో పోటాపోటీగా నటించి మెప్పించాడు.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భీమ్లా నాయక్ విధ్వంసానికి తిరుగులేకుండా పోయిది. ప్రీమియర్స్ నుండే రచ్చ చేసిన ఆ సినిమా నైజాంలో అయితే ఫస్ట్ డే అల్ టైం ఓపెనింగ్స్ తెచ్చుకుని ఏకంగా 12 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే భీమ్లా నాయక్ కి ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం రిలీజ్ టైం లో ప్రభుత్వం నుండి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇబ్బందులు అనడం కన్నా ఈర్ష్య తో సినిమాని కావాలని రిలీజ్ కాకుండా అడ్డుకున్నారని చెప్పొచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పలువురు ఎమ్మెల్యే లు సైతం భీమ్లా నాయక్ షో జరగకుండా చేసేందుకు థియేటర్ల దగ్గర MRO లను పెట్టారంటే ఆ రోజుల్లో ఎంత రచ్చ జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. పేర్ని నాని, కోడలి నాని లాంటి MLA లు ఓపెన్ గా సినిమా రిలీజ్ కి అడ్డుకున్నారు. పైగా కలెక్షన్స్ లో దెబ్బ తీయాలని కొన్ని థియేటర్లలో కేవలం 30 రూపాయలకే టికెట్స్ విక్రయించాలని రేట్లు పెట్టారు. అయితే కొందరు టిడిపి నేతల చొరవతో భీమ్లా నాయక్ వివాదం సర్దుమణిగింది.

- Advertisement -

ఇక భీమ్లా నాయక్ 106 కోట్ల థియేట్రికల్ బిజినెస్ కు గాను 98 కోట్ల షేర్ ని 162 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో గనుక భీమ్లా నాయక్ ని అడ్డుకోకుండా ఉండే మరో 20 కోట్లు అదనంగా వచ్చి ఉండేదని అప్పటి ట్రేడ్ విశ్లేషకులు చెప్పడం జరిగింది. ఇక దీని తర్వాత పీకే బ్రో సినిమాలో ప్రత్యేక పాత్రతో మెప్పించగా, ఇప్పుడు ఓజి సినిమాతో సెప్టెంబర్ లో రానున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు