Devara : దానికి చాలా టైం ఉంది మెల్లిగా అప్డేట్స్ వస్తాయి – కొరటాల శివ

Devara : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “దేవర” కూడా ఒకటి. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంత ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘దేవర’ సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ డిలే వల్ల సమ్మర్ నుండి ఏకంగా దసరా కి వాయిదా పడింది. ఇక సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా దేవర ని లేట్ గా తీసుకు వచ్చినా కాలర్ ఎగరేసే సినిమాను తీసుకువస్తున్నామని ఎన్టీఆర్ ఓ వేదికపై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలే దర్శకుడు కొరటాల శివ ఈ కథ కోసమే చాలా టైం తీసుకున్నాడు. ఇక ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టక తప్పని పరిస్థితి. ఓ భారీ బ్లాక్ బస్టర్ తో తన మార్క్ మళ్ళీ చూపించాలని కసి మీదున్నాడు కొరటాల శివ.

కొరటాల శివ మార్క్ లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్..

ఇక దేవర (Devara)లో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ కు RRR సినిమా తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. ఇక మొన్న మల్టి స్టారర్ తో వచ్చాడు కాబట్టి, ఎన్టీఆర్ ఇప్పుడు సోలోగా పాన్ ఇండియా వైడ్ గా సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దేవర తో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ తో ఓ రేంజ్ అంచనాలను క్రియేట్ చేసిన మేకర్స్, త్వరలోనే ఒక్కొక్కటిగా పాటలని కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకే పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్ల కోసం ఇప్పట్నుంచే కసరత్తులు చేస్తున్నారు. ఇక అన్ని భాషలకు సంబంధించి బిజినెస్ లెక్క కూడా ఇప్పట్నుంచే మొదలుపెట్టగా, హిందీ కి సంబంధించి దేవర బాధ్యతలను కారం జోహార్ తీసుకున్నాడు. ఇక దేవర షెడ్యూల్ కి చిన్న గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్, ఆయా గ్యాప్ లో బాలీవుడ్ లో వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక కొరటాలశివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.

త్వరలోనే అప్డేట్స్ వస్తాయి..

ఇక తాజాగా సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని గెస్ట్ లు గా గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి కొరటాల శివ ని దేవర అప్డేట్స్ ఇవ్వమని, అలాగే రాజమౌళి మహేష్ అప్డేట్స్ కూడా ఇవ్వమని అడిగాడు. ఇక ఈ ఈవెంట్ లో కొరటాలశివ మాట్లాడుతూ, దేవర అప్డేట్స్ త్వరలో వస్తాయి అంటూ, అక్టోబర్ 10న రిలీజ్ అని చెప్పేశాం కదా.. అని నైస్ గా తప్పించుకున్నాడు. ఎందుకంటే రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఎలాంటి హింట్ ఇవ్వకూడదని కొరటాల శివ అనుకున్నాడని తెలిసిపోతుంది. అయితే నెటిజన్ల అభిప్రాయం ప్రకారం ఎన్టీఆర్ బర్త్ డే కి మరో స్పెషల్ టీజర్ వదలనున్నారని తెలుస్తుంది. ఒకవేళ టీజర్ కుదరకపోతే ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి దేవర అఫిషియల్ ప్రమోషనల్ అప్డేట్స్ ఎన్టీఆర్ బర్త్ డే నుండే స్టార్ట్ అవుతాయా అన్నది చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు