Punith Rajkumar: పునీత్ రాజ్ మరణం పై విస్తుపోయే నిజాలు..!

Punith Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈయన కెరియర్ లో ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. లెక్కలేనంత అభిమానాన్ని కూడా సంపాదించుకున్నారు పునీత్ రాజ్ కుమార్.. అయితే అనుకోకుండా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో ఈ విషయం అటు యావత్ సినీ ఇండస్ట్రీని కలచివేసింది. పునీత్ రాజ్ కుమార్ మరణాంతరం ఆయన చేసిన సేవలకు గానూ కర్ణాటక ప్రభుత్వం ఏకంగా రత్న పురస్కారాన్ని సైతం ప్రకటించారు.

Punith Rajkumar: Shocking facts about Punith Raj's death..!
Punith Rajkumar: Shocking facts about Punith Raj’s death..!

గుండెపోటు తో మృతి..

ఈ నటుడు చేసినటువంటి సేవలు భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే అక్కడ స్కూళ్లలో, పాఠ్యాంశాలలో ఈయన కథను కూడా చేర్చినట్టుగా తెలుస్తోంది. రియల్ హీరోగా కూడా పేరు పొందిన పునీత్ రాజ్ కుమార్.. లేరనే విషయాన్ని ఇప్పటికీ అభిమానులైతే జీర్ణించుకోలేకపోతున్నారు.. పునీత్ రాజ్ ఎక్కువగా తన ఫిట్నెస్ పైన దృష్టి పెట్టేవారు.. ఈయనను ముద్దుగా అభిమానులు అప్పు అని పిలుస్తూ ఉంటారు.. వర్కౌట్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని దీంతో కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు వైద్యులు సైతం తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా పునీత్ రాజ్ కుమార్ డెత్ పై పలు రకాల విషయాలు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పునీత్ మరణానికి అసలు కారణం ఇదే

అసలు విషయంలోకి వెళ్తే పునీత్ రాజ్ కుమార్ మరణానికి ముఖ్య కారణం కోవీషీల్డ్ తీసుకోవడమే అన్నట్లుగా సోషల్ మీడియాలో అభిమానులు సైతం చర్చించుకుంటున్నారు.. కోవిడ్ నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పునీత్ రాజ్ కుమార్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారని అయితే ఈ వ్యాక్సిన్ కి సంబంధించిన ఫోటోతో ఒక పోస్టును షేర్ చేస్తూ అభిమానులకు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని సలహాను ఇచ్చారు పునీత్ రాజ్ కుమార్.. అయితే ఆ సమయంలో అప్పుడు కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

అభిమాని హెచ్చరించినా వినని పునీత్..

అయితే ఆ సమయంలో కోవీ షీల్డ్ అసలు తీసుకోకూడదని.. దీనివల్ల సైడ్ ఎఫెక్టులు ఉంటాయని కూడా ఒక అభిమాని పునీత్ రాజ్ కుమార్ ని హెచ్చరించారట.. అయినప్పటికీ అది వేసుకున్నారు.. అయితే కోవీషీల్డ్ వేసుకుంటే.. సైడ్ ఎఫెక్ట్ వల్ల గుండెపోటు వస్తుందని నిర్ధారణలో తేలింది.. దీంతో తమ హీరోకి కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చిందని.. కోవి షీల్డ్ వల్లే తమ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించి ఉంటాడనే అనుమానాలను అభిమానులు తెలియజేస్తున్నారు.. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకపోయి ఉంటే అలా హార్ట్ ఎటాక్ వచ్చి ఉండేది కాదని తెలుపుతున్నారు..

ఆందోళనలో అభిమానులు.

అప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న పునీత్ రాజ్ కుమార్ కి సడన్గా గుండెపోటు రావడం ఏంటి? మరణించడం ఏంటి? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే పునీత్ రాజ్ కుమార్ మరణం పై మరొకసారి ఈ విషయం వైరల్ గా మారుతున్నది. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు