KrishnammaPreRelease Event : స్కోర్లు ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు.. దయచేసి సినిమాలు చూడండయ్యా – అనిల్ రావిపూడి

Krishnamma PreReleaseEvent : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ “కృష్ణమ్మ” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఎస్ఎస్. రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరవడం జరిగింది. ఇక ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను వారు కలిసి రిలీజ్ చేయడం జరిగింది. గ్రామీణ నేప‌థ్యం లో యాక్షన్‌, ఎమోషన్స్ తో కూడిన సీన్లతో ఆక‌ట్టుకోనుందని కృష్ణమ్మ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ల స్పీచ్ వైరల్ గా మారింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి స్పీచ్ తన సినిమాల్లాగే ఫన్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న సినిమాల పరిస్థితి ని గురించి ప్రస్తావిస్తూ పలు అస్లక్తికర విషయాలు వ్యాఖ్యానించడం జరిగింది.

థియేటర్ కి వచ్చి సినిమాలు చుడండి – అనిల్ రావిపూడి

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ ఈవెంట్ కి పిలిచినందుకు, సినిమాని దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నందుకు కొరటాలశివకి థాంక్స్ చెప్పాడు. ఇక సత్యదేవ్ ఒక సినిమా హీరోకి, గంబీరమైన గొంతుతో కూడిన, ఆహార్యానికి తగ్గ కటౌట్ ఉన్న హీరో అని ప్రశంసించాడు. అలాగే ఈ ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాలు చుడండి అంటూ, సమ్మర్ కదా అని ఇంట్లో కూర్చోకండి, ఐపీఎల్ మ్యాచ్ లు స్కోర్లు ఫోన్లో కూడా చూడొచ్చు. ఈవెనింగ్, నైట్ షోలు థియేటర్లకు వచ్చి సినిమాలు చుడండి అన్నారు. అలాగే ఈ ఈవెంట్ లో రెండు చూడలేనివి చూశానని అంటూ, నటుడు కళ్యాణ్ పద్యాన్ని అద్భుతంగా పాడాడని, అలాగే హీరోయిన్ అథిరా తెలుగు స్పీచ్ కూడా చాలా బాగుందన్నారు. ఇక ఫైనల్ గా కొరటాల శివ దేవర, అలాగే రాజమౌళి మహేష్ సినిమాల అప్డేట్స్ ఇవ్వమని కోరుతూ స్పీచ్ ముగించాడు.

విలెజ్ యాక్షన్ థ్రిల్లర్ గా కృష్ణమ్మ..

ఇక సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ (Krishnamma PreReleaseEvent ) బెజవాడ ప్రాంతంలో ఓ ముగ్గురు స్నేహితుల క‌థ‌తో తెర‌కెక్కింది. తాము చేయని నేరానికి ఒక తీవ్రమైన కేసులో చిక్కుకున్న ముగ్గురు అనాథ‌ల కథతో రూపొందింది. ఇక రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కూడా ఆద్యంతం గ్రిప్పింగ్ గా ఉండి ఆకట్టుకోగా, కాల భైరవ అద్భుతమైన నేప‌థ్య సంగీతం హైలెట్ కానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో లక్ష్మణ్ మీసాల, కృష్ణ, అర్చన అయ్యర్, రఘు కుంచె, నందగోపాల్‌ కీలక పాత్రల్లో నటించారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతిరా రాజ్ నటించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న ఈ చిత్రం మే 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘కృష్ణమ్మ’ సినిమాని వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ – ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు