#HariHaraVeeraMallu Teaser : ఇది కదా పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమా రిలీజ్ అయింది అని అంటేనే ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు అంతా బుక్ మై షోస్ వచ్చేసి ఆన్లైన్లో టికెట్లు కొనుక్కుంటున్నారు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ కొనుక్కోవాలంటే చాలా రిస్క్ అని చెప్పొచ్చు. చాలా చోట్ల ట్రాఫిక్ జాములు మొదలయ్యేవి. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస హిట్ సినిమాలుతో మంచి ట్రాక్ లో ఉన్నారని చెప్పవచ్చు.

అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కళ్యాణ్ మళ్ళీ వకీల్ సాబ్ సినిమా తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్నాయి. పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడు ప్రాజెక్టుల పైన మంచి ఆసక్తి నెలకొంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు, సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజి, హరిష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాలన్నిటి పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే వీటన్నిటిని మించి పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది. దాదాపు 60 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ కెరియర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కావటం విశేషం. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దర్శకుడు క్రిష్ ఈ సినిమాతో సంచలనం సృష్టిస్తాడు అని చాలామంది ఆశిస్తున్నారు ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్స్ సినిమా పైన ఆసక్తిని పెంచాయి. తాజాగా ఇప్పుడు మరో టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రిలీజ్ చేసిన ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు.

- Advertisement -

ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. క్రిష్ జాగర్లమూడి ఈ టీజర్ ను చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. పవన్ కళ్యాణ్ లోని ప్లస్ ఎలిమెంట్స్ అన్ని తీసుకొని పర్ఫెక్ట్ గా చూపించాడు క్రిష్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ శత్రువుల్ని సంహరించే విధానం గూస్ బమ్స్ తెప్పిస్తుంది. అలానే పవన్ కళ్యాణ్ ని రివీల్ చేసిన విధానం ఇవన్నీ కూడా అద్భుతంగా ఈ టీజర్ లో వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ టీజర్ చూస్తుంటే సినిమా పైన అంచనాలు మరింత పెరుగుతున్నయని చెప్పొచ్చు. అయితే ఇదేవిధంగా ఈ సినిమా రెండు పార్ట్ లలో ఉండపోతుంది అర్ధమవుతుంది.ఇకపోతే ప్రస్తుతం ఈ ఏడాది ఓజీ సినిమా రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందని చాలామంది ఆశిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు