Nani: రజనీకాంత్ డైరెక్టర్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్..హిట్ పక్కా..!

Nani.. నాచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా బిజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. అంతేకాదు పలు చిత్రాలలో కీలకపాత్రలు చేయడానికి కూడా ఈయన వెనుకాడడం లేదు.. ఇక ఈ నేపథ్యంలోని సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ టీ. జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ అనే తమిళ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ నాని కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ డైరెక్టర్ తో నాని సినిమా చేయడానికి సిద్ధమైపోయారు..

Nani: Nani next project confirmed with Rajnikanth's director.. hit guarantee..!
Nani: Nani next project confirmed with Rajnikanth’s director.. hit guarantee..!

జ్ఞానవేల్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నాని..

ఇదిలా ఉండగా మరోవైపు ప్రముఖ డైరెక్టర్ టీ.జే.జ్ఞానవేల్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న వెట్టయాన్ చిత్రంలో నానికి కీలక పాత్రను ఆఫర్ చేశారు.. అయితే నాని ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించడం జరిగింది.. కానీ ఆ పాత్రలో ఇప్పుడు స్టార్ హీరో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రానా ను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జ్ఞానవేల్ నాని కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం

జ్ఞానవేల్ దర్శకత్వంలో నాని..

ఈసారి ఎలాగైనా సరే టాలీవుడ్ హీరో తో పక్కా విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్న జ్ఞానవేల్ అందులో భాగంగానే ఒక బలమైన కథను నాని కోసం సిద్ధం చేశారట ..ఈ కథను నానికి వినిపించగా ఈయన కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఇక నాని తన తదుపరి చిత్రాన్ని టీ.జే.జ్ఞానవేల్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే జ్ఞానవేల్ నాని కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్ ఇప్పుడు భారీ విజయాన్ని అందిస్తుందని నమ్మకం నానిలో కుదిరిందట.. అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది

- Advertisement -

టీ.జే.జ్ఞానవేల్ సినిమాలు..

చెన్నైలోని ప్రెసిడెన్సి కళాశాల నుండి డిగ్రీ పట్టా అందుకున్న ఈయన తమిళ సాహిత్యంలో పి.హెచ్.డి పూర్తి చేశారు .. ఇక డైరెక్టర్గా పని చేయడానికి ముందు 2010లో రక్త సరితిరమ్ అలాగే 2011లో వచ్చిన పయనం చిత్రాలకు డైలాగు రైటార్గా పనిచేసే ఆ తర్వాత 2017లో అశోక్ సెల్వన్ మరియు ప్రియా ఆనంద్ నటించిన కామెడీ చిత్రం కూతతిల్ ఒరుతన్ అనే చిత్రం ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తర్వాత 2021లో సూర్య హీరోగా వచ్చిన జై భీమ్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ సినిమాకి దర్శకుడిగా మాత్రమే కాదు రచయితగా కూడా పనిచేశారు . ప్రస్తుతం వెట్టయాన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. టీ.జే. జ్ఞాన వేల్ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మరి రజనీకాంత్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఈ సినిమా పూర్తయిన వెంటనే నానితో సినిమా చేయబోతున్నారు జ్ఞానవేల్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు