Yeh Ratein Yeh Mausam: తన కూతురికి పాటను నేర్పించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అంతే కాకుండా చాలా పాటలు కూడా ఇప్పటివరకు పాడారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు తోనూ మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో కూడా బిజీ అయ్యారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు ప్రాజెక్టులను చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రస్తుతం సినిమాలుకు బ్రేక్ ఇచ్చి రాజకీయ పనుల్లో బిజీ అయ్యాడు పవన్. అయితే ఈ సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ అందించాడు పవన్ కళ్యాణ్. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కళ్యాణ్ తనకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అని అడిగినప్పుడు అమితాబచ్చన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే సమాధానాన్ని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే చిరంజీవిగారి కంటే ముందు అమితాబచ్చన్ గారికి తాను పెద్ద అభిమానిని అని చిరంజీవి గారి హీరో అయిన తర్వాత చిరంజీవి గారికి అభిమానిగా మారానని చెప్పుకొచ్చాడు.

మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన సైరా సినిమాలో అమితాబచ్చన్ ఒక కీలక పాత్రలో కనిపించారు. ఆ తరణంలో కూడా పవన్ కళ్యాణ్ వెళ్లి అమితాబచ్చన్ కలిశారు. ఇకపోతే ఎటువంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతారు అని ప్రశ్న ఎదురైనప్పుడు, తను హర్రర్ సినిమాలు చూడటానికి ఇష్టపడతానంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా తనకు బాగా ఇష్టమైన “యే రాతిన్ యే మౌసం నాది కా కినారా కిషోర్ కుమార్” పాటను కూడా ఒక రెండు లైన్లు ఆలపించారు కళ్యాణ్.

- Advertisement -

అయితే ఈ పాట గురించి కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జీ తెలుగులో ప్రచారం అయ్యే డ్రామా జూనియర్స్ అనే షో కి ఒక సందర్భంలో గెస్ట్ గా వచ్చారు రేణుదేశయ్ మరియు తన కుమార్తె ఆద్య. ఆ తరుణంలో రేణుదేశయ్ కుమార్తె ఆధ్యాను పాట పాడమని అడిగినప్పుడు “యే రాతిన్ యే మౌసం నాది కా కినారా” ఈ హిందీ పాటను బాలీవుడ్ మూవీ దిల్లీ కా థగ్ (1958) కోసం కిషోర్ కుమార్ మరియు ఆశా భోంస్లే పాడారు. ఈ పాటకు రవి సంగీతం సమకూర్చారు.

ఇకపోతే ఈ పాటను రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పాడటం. గతంలో ఇదే పాటను ఆద్య పాడటం ఇదంతా కూడా చూస్తుంటే ఈ పాటను తన కుమార్తె ఆద్య పాడటం వలన, ఈ పాటను పవన్ కళ్యాణ్ ఆద్యకు నేర్పించి ఉంటారని చాలామంది మాట్లాడుకుంటున్నారు.ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు టీజర్ రిలీజ్ ఐన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు పార్ట్ లలో రాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు