Navadeep : ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నా.. రిలీజ్ పై స్పష్టత లేదు..

Navadeep : టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ చాలా రోజుల తర్వాత హీరోగా మళ్ళీ సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. కెరీర్ బిగినింగ్ లో మంచి సూపర్ హిట్ సినిమాలు తీసిన ఈ హీరో, సెలక్షన్ బాగాలేకో, లక్ కలిసిరాకో ఆ తర్వాత వరుస ప్లాపులు ఎదుర్కొని ఫేడవుట్ అయ్యాడు. ఇక ఈ మధ్య పలు స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ కూడా వేసాడు. అయితే కొంత బ్రేక్ తర్వాత హీరోగా, స‌రికొత్త‌గా, న‌వ‌దీప్ 2.0గా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్ మౌళి’. విభిన్న‌మైన జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడిగా అవ‌నీంద్ర వ్యవహరిస్తున్నారు. నైరా క్రియేషన్స్, సీ స్పేస్ గ్లోబల్ బ్యానర్లపై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. నవదీప్‌ కు జోడీగా పంఖురి గిద్వానీ నటిస్తోంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. నవదీప్ చాలా కొత్తగా యాంగ్రీ గా ఉన్నాడు. ఇక ఈ మూవీ ఒక పెయింటర్ ప్రేమకథగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా, పలు క్రేజీ సినిమాల పోటీ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం షూటింగ్ డిలే, టెక్నికల్ కారణాలు చెప్తున్నా, మేకర్స్ మాత్రం సోలో రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రమోషన్స్ తో అంచనాలు రెట్టింపు..

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వ‌చ్చిన ప్ర‌తి అప్డేట్ కూడా వినూత్నంగా ఉండి అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా లవ్ మౌళి మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నవదీప్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నవదీప్ మౌళిగా మారడమనేది చూడవలసిన అసాధారణ దృశ్యం అంటూ క్యాప్షన్ ఇచ్చి హైప్ క్రియేట్ చేశారు. మాస్ అవతార్ త్వరలో థియేటర్లలో మిమ్మల్ని అలరిస్తుందని తెలిపారు. మోషన్ పోస్టర్ పై ఊర మాస్ మౌళి అంటూ రైటప్ ఇచ్చారు. ఇక నవదీప్.. సిక్స్ ప్యాక్ బాడీతో షర్ట్ లేకుండా కోపంతో పరిగెత్తుతున్నట్లు చూపించారు మేకర్స్. ఆ పోస్టర్ లో జులపాల జుట్టు, భారీ గెడ్డంతో రగ్డ్ లుక్ లో వేరే లెవెల్ లో ఉన్నారు నవదీప్. మొత్తానికి ఈ పోస్టర్ తో మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమా కోసం నవదీప్ చాలా హార్డ్ వర్కౌట్ చేసినట్లు కనిపిస్తోంది. అదిరిపోయే ఫిజిక్ తో కండలు పెంచగా, ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవదీప్ లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

రిలీజ్ డేట్ ఎప్పుడు?

ఇక నవదీప్ ఈ సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. తన జీవితంలో జరిగిన ప్రేమ కథల ఫలితమే లవ్ మౌళి సినిమా అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సినిమాతో నవదీప్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారని అంతా జోస్యం చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇక ఈ సినిమా చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని అంతా అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం సెన్సార్ పూర్తవ్వకపోవడం వల్లే వాయిదా పడిందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారని వార్తలు వినిపిస్తున్నా, ఎక్కడా మేకర్స్ నుండి దానికి హడావిడి కనిపించడం లేదు. సోలో రిలీజ్ కోసమే చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం టాలీవుడ్ లో నెలరోజుల నుండి హిట్ సినిమా లేక ఆకలితో ఉన్న ఆడియన్స్ కి కంటెంట్ బాగుందే సినిమా వస్తే నెత్తిన పెట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రెండు వారాల్లో చిన్న సినిమాల పోటీ ఉన్నా, ఇప్పుడు తొందరగా రిలీజ్ చేస్తే మంచి ఫలితాన్ని అందుకోవచ్చని అంటున్నారు. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు