Singer uma Ramanan: కోలీవుడ్ ప్రముఖ సింగర్ మృతి.. ఇళయరాజా స్పెషల్ సంతాపం..!

Singer uma Ramanan..సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు ఆ సెలబ్రిటీల కుటుంబ సభ్యులనే కాదు అభిమానులను, సెలబ్రిటీలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషాదాలు అభిమానుల గుండెల్లో తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సింగర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ సీనియర్ సింగర్ ఉమా రమణన్ నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు సమాచారం.సంగీత దర్శకుడు ఇళయరాజా నేపథ్యంలో ఎన్నో పాటలకు గాత్రాన్ని అందించారు ఉమా రమణన్ .. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో పాటలు సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడమే కాదు అంతకుమించి భారీ సక్సెస్ ని కూడా సొంతం చేసుకున్నాయి.. అటు సింగర్ గా ఉమా రమణన్ కి కూడా భారీ గుర్తింపు లభించింది.

Singer uma Ramanan: Kollywood's famous singer died.. Ilayaraja special condolence..!
Singer uma Ramanan: Kollywood’s famous singer died.. Ilayaraja special condolence..!

మరణానికి కారణాలు తెలియలేదు..

69 సంవత్సరాల వయసులో తమిళ గాయని ఉమా రమణన్ మే 1న మరణించినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. అయితే ఈమె తాజాగా చెన్నైలో నివసిస్తుండగా అక్కడే మరణించినట్లు సమాచారం. ఈమె గాయకుడు భర్త ఏవి రమణన్ మరియు ఆమె కుమారుడు విగ్నేష్ రమణన్ ఈమె మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే ఈరోజు ఆమె అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నట్లు సమాచారం.. ఇక ఈమె మరణ వార్త విని అభిమానులు శోభసంద్రంలో మునిగిపోయారు.. చాలామంది అభిమానులు ఎక్స్ ద్వారా ఈమెకు నివాళులు అర్పిస్తున్నారు. గాయకురాలు శ్రీమతి ఉమా రమణన్ మరణించారనే బాధాకరమైన వార్తతో మేము మేల్కొన్నాము.. సూపర్ సింగర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఈమె ప్రథమ స్థానంలో ఉంటారు.. శ్రీమతి ఉమా రమణన్ ఎంతో సంక్లిష్టమైన భావోద్వేగాలని కూడా తన ముఖంపై చూపించకుండా అద్భుతంగా పాటలు పాడి శ్రోతలను అలరించారు.. ఈమె మరణం మమల్ని మరింత బాధకు గురి చేస్తోంది ఓం శాంతి మేడం.. అంటూ ఒక అభిమాని ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు..

అభిమాని పోస్ట్..

Ethereal.. ఉమా రమణన్ స్వరాన్ని వర్ణించడానికి నేను ఉపయోగించే పదమిది.. అత్యంత సున్నితమైన స్వరం ఆధ్యాత్మిక అనుభూతిని మనకు అందిస్తుంది… ఆమె పాటలు పాడినందుకు ధన్యవాదాలు.. నా మనసులో మొదటిది నందు లోని పాట.. ఈమె మరణం మరింత బాధాకరం.. ఓంశాంతి అంటూ ఇంకొక నెటిజన్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.

- Advertisement -

ఉమా – ఇళయరాజా కాంబో..

ఇకపోతే ఉమా మరియు ఇళయరాజా కలసి అనేక హిట్లను అందించారు.. ముఖ్యంగా గీతాంజలి నుండి ఓరి జీవన్ అలైతాతు, ఆరంగేత్ర వేలై నుండి ఆగవ వెన్నిలావే, తంబిక్కు ఎంత ఊరు నుండి పూ ఇ సైకుమ్ , నీలాల్గల్ నుండి పూంగతావే తాల్ తిరవై అలాగే కెలడి కన్మణి నుండి నీ పధి నాన్ పధి కన్నె వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.

మణిరత్నం సంతాపం..

ఈమె మరణానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కూడా ప్రత్యేకంగా సంతాపం తెలియజేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈయన సంగీత సారథ్యంలో ఎన్నో పాటలను అందించిన ఉమా రమణన్ 69 సంవత్సరాల వయసులో మరణించడం నన్ను మరింత బాధకు గురిచేసింది. అంటూ ఆయన స్పెషల్ సంతాపం తెలియజేశారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు