Krishnamma Pre release event: కృష్ణమ్మ సత్యదేవ్ కి కలిసొచ్చేనా..?

Krishnamma Pre release event: చిన్న చిన్న హావభావాలతో అన్ని రకాల నటనను చూపించగలిగిన నటులలో హీరో సత్యదేవ్ కూడా ఒకరు. తన అద్భుతమైన నటనతో అటు ఇండస్ట్రీకి ఎటు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే.. అయితే ఇప్పటివరకు ఈయన చేసిన ఏ సినిమా కూడా ఈయన కెరియర్ కు గ్రాండ్ సక్సెస్ ను అందివ్వలేదు.. కానీ తాజాగా కృష్ణమ్మ సినిమాతో కచ్చితంగా ఈయన స్టార్ అయిపోతారంటూ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కామెంట్లు చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి సత్యదేవ్ పై కామెంట్లు చేయడంతో ఇక ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని, సత్యదేవ్ ను స్టార్ ను చేస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు. మరి కృష్ణమ్మ సినిమా సత్యదేవ్ కి ఎటువంటి స్టార్ స్టేటస్ ను అందిస్తుందో చూడాలి.

Krishnamma Pre release event:Will Krishnamma gave success to Satyadev?
Krishnamma Pre release event:Will Krishnamma gave success to Satyadev?

కృష్ణమ్మ సినిమా విశేషాలు..

సత్యదేవ్ , అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం కృష్ణమ్మ.. గోపాలకృష్ణ దర్శకత్వంలో డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదల కానుండగా.. నిన్న సాయంత్రం చాలా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు చిత్ర బృందం . ఇక ఈ వేడుకకు టాప్ డైరెక్టర్స్ చీఫ్ గెస్ట్ గా రావడమే కాదు సినిమాపై పలు రకాల కామెంట్లు చేశారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి..

హైదరాబాదులో నిర్వహించిన కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ.. ముఖ్యంగా కృష్ణమ్మ సినిమా టైటిల్ నాతో పాటు అందరినీ ఆకర్షించడానికి కారణం కొరటాల శివ సమర్పించడమే.. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వెల్లడించారు రాజమౌళి.. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని ఖచ్చితంగా థియేటర్లలో చూడాలనిపించేలా గోపాలకృష్ణ తెరకెక్కించారు కాలభైరవని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అంటూ కృష్ణమ్మ టీం కి ఆల్ ద బెస్ట్ చెప్పారు రాజమౌళి..

- Advertisement -

సత్యాదేవ్ మాట్లాడుతూ..

రాజమౌళి , కొరటాల శివ , అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ఉన్న ఈ వేదికపై నేను మాట్లాడడం ప్రపంచంలోనే అతి ఖరీదైన వేదికగా భావిస్తున్నాను… కృష్ణమ్మ విడుదల తర్వాత నేను బయట కనిపించినా ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడతారు .. అందుకు నాది గ్యారెంటీ. క్రికెట్ కి సచిన్ టెండుల్కర్ ఎలాగో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అలాగా.. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్ తీసుకువచ్చారు.. ఇక ఆయన ఈ సినిమా గురించి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది.. కచ్చితంగా ఈ సినిమాతో మేము మంచి సక్సెస్ ని అందుకుంటాము అంటూ సత్యదేవ్ స్పష్టం చేశారు… మొత్తానికి అయితే ఈ సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకునే ప్రయత్నం చేస్తున్నారు సత్యదేవ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు