Sitara: SSMB 29 తో సితార లాంఛ్.. నిజమేనా..?

మహేష్ అభిమానులు రాజమౌళి సినిమా షూటింగ్ ఆరంభం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు.. SSMB-29 సినిమా గురించి రోజుకొక న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంటుంది.. ముఖ్యంగా హీరోయిన్, విలన్, స్టోరీ, రెమ్యూనరేషన్, టెక్నికల్ టీం గురించి ఎక్కడో ఒకచోట ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది.. అయితే ఇప్పుడు తాజాగా మరొక న్యూస్ వైరల్ గా మారుతోంది. అదేమిటంటే మహేష్ బాబు కూతురు సితారాని ఈ చిత్రంతో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే విషయం వినిపిస్తోంది.

ఇకపోతే తాజాగా వినిపిస్తున్న మరో కొత్త న్యూస్ ఏంటంటే.. మహేష్ , మహేష్ కూతురుని ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి రాజమౌళి సిద్ధమవుతున్నారా ? అంటే సన్నిహిత వర్గాల నుంచి అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.. మహేష్ బాబు మొదటిసారిగా పాన్ ఇండియా చిత్రం కోసం కొన్ని నెలలుగా సిద్ధమవుతూనే ఉన్నారు.. ఇటీవల జర్మనీకి వెళ్లి బాడీ ఫిట్ నెస్ కి అవసరమైన ట్రైనింగును కూడా మహేష్ బాబు పూర్తి చేసుకున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి వర్క్ పనులు కూడా మొదలు పెట్టడానికి రాజమౌళి సిద్ధం అవుతున్నారు. మరో నాలుగు నెలలు ఈ వర్క్ షాప్ కూడా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వర్క్ షాప్ లో మహేష్ తో పాటు సితార కూడా పాల్గొనబోతున్నట్లు సన్నిహితుల వర్గాల నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సితార కూడా నటించబోతోంది అని సమాచారం.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ముఖ్యంగా గ్లోబ్ ట్రూరింగ్ జోనర్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.. పాన్ వరల్డ్ ని షేక్ చేసే విధంగా ఈ సినిమా ఉండబోతోంది.. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రంతో సితార ను లాంచ్ చేస్తే కచ్చితంగా ఆమె క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో వెళ్తుందని చెప్పవచ్చు.

- Advertisement -

అంతేకాకుండా సితారకు ఇందులో ఒక కీలకమైన పాత్రను ఇస్తే ఖచ్చితంగా తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటుంది. ఇప్పటికే సితార ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు ఎన్నో యాడ్స్ తో పాటు ఎన్నో గొప్ప పనులు చేస్తూ భారీగానే క్రేజ్ సంపాదిస్తోంది. చిన్న వయసులోనే డ్యాన్సులతో తన క్యూట్ మాటలతో కూడా అదరగొట్టేసిన సితార.. కెమెరా అంటే భయం అనడానికి ఎక్కడ అవకాశాలు లేవు.. అయితే SSMB -29 లో సితార ఉంటుందనే విషయం పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు